Navdeep: ముగిసిన నవదీప్ విచారణ.. మళ్లీ పిలుస్తామన్న పోలీసులు

డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది. ఐదు గంటలుగా నవదీప్‌ను పోలీసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. విచారణకు పోలీసులు మళ్లీ రమ్మన్నారని పేర్కొన్నాడు.

New Update
Navdeep: ముగిసిన నవదీప్ విచారణ.. మళ్లీ పిలుస్తామన్న పోలీసులు

Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది. ఐదు గంటలుగా నవదీప్‌ను పోలీసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. విచారణకు పోలీసులు మళ్లీ రమ్మన్నారని పేర్కొన్నాడు. డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో నార్కోటిక్ బృందాలు బాగా పనిచేస్తున్నాయన్నాడు. వైజాగ్‌కు చెందిన రామచంద్‌తో తనకు పరిచయం ఉందని తెలిపాడు. అంతేకాని తాను ఎప్పుడు.. ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదన్నాడు. రామచంద్‌తో తాను ఎలాంటి డ్రగ్స్ కోనుగోలు చేయలేదని స్పష్టం చేశాడు.

గతంలో ఒక పబ్‌ను నిర్వహించినందుకు తనను పోలీసులు పిలిచి విచారించారన్నాడు. గతంలో సిట్, ఈడీ విచారించిందని.. ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు విచారిస్తున్నారన్నాడు. విచారణలో అధికారులు అడిగిన అన్ని వివరాలకు సమాధానం ఇచ్చానని.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని తనకు చెప్పారని నవదీప్ వెల్లడించాడు. మరోవైపు  నవదీప్ ఫోన్ ను అధికారులు సీజ్ చేశారు.

డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు.. 

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను విచారించామని యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతా రెడ్డి తెలిపారు. తాము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడన్నారు. అయితే డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఉన్న 81 లింక్స్‌ను గుర్తించగా.. 41 లింక్స్‌పై వివరాలు ఇచ్చాడని పేర్కొ్న్నారు. విచారణలో భాగంగా తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడని.. ఇప్పుడు మాత్రం ఎలాంటి డ్రగ్స్ వాడటం లేదని చెబుతున్నాడన్నారు. తన స్నేహితుడు రామ్ చంద్‌తో కలిసి గతంలో పబ్ నిర్వహించినట్టు తెలిపాడన్నారు. నవదీప్ ఫోన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేశాడని.. అందుకే అతని ఫోన్ రీట్రైవ్ చేసి మళ్లీ విచారిస్తామని ఆమె తెలిపారు. డేటా అంత తిరిగి స్వాధీనం చేసుకున్నాక మళ్లీ నవదీప్‌ని పిలిచి విచారిస్తామని సునీతా రెడ్డి వెల్లడించారు.

అంతకుముందు ఐదు గంటలుగా సాగిన విచారణలో అధికారులు ఎన్నిసార్లు అడిగినా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని పబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు ఆధారాలు చూపించగా సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నాడు. రామ్ చందర్ దగ్గరే కాక ఎవరెవరి నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నారనే కోణంలో ప్రశ్నించిన్నట్లు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్ వినియోగదారుడిగా హీరోని గుర్తించామని నార్కోటిక్ పోలీసులు చెబుతున్నారు.

సెప్టెంబరు 14న తెలంగాణకు సంబంధించిన యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, గుడి మల్కాపూర్ పోలీసు అధికారులతో కలిసి బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్ల సహా పలువురును అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి కొకైన్‌తో పాటూ పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విచారణలోనే.. డ్రగ్స్ వ్యాపారులతో నవదీప్ సంప్రదింపులు జరిపినట్టుగా తేలిందని అధికారులు వెల్లడించారు. అరెస్టైన నిందితుల్లో ఒకరైన రామచందర్​ దగ్గర నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. నవదీప్‌తో పాటు తెలుగు సినీ నిర్మాతలు, పలువురు ప్రముఖులు ఈ కేసులో ఉన్నారు. ఇప్పటికే వెంకట్, బాలాజీతో పాటూ మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే నవదీప్ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ వస్తున్నాడు. డ్రగ్స్ విషయం బయటపడిన దగ్గర నుంచీ మాయం అయిపోయాడు. ఈ క్రమంలోనే నవదీప్ ముందు జాగ్రత్తగా బెయిల్ పిటీషన్ వేయగా హైకోర్టు దాన్ని తిరస్కరించింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసులు ఇచ్చి.. విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్ కూడా పోలీసుల విచారణకు హాజరు కావాలని గట్టిగా చెప్పింది.

Advertisment
తాజా కథనాలు