Madanapalle Fire Incident: మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దగ్ధం ఘటన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ముఖ్య అనుచరుడు.. మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకవెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకట చలపతి నివాసంలో సోదాలు చేసిన పోలీసులు పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ నేత బాబ్ జాన్ ఇంట్లో పోలీసుల తనిఖీలకు యత్నం చేశారు. అయితే, తనిఖీలకు బాబ్ జాన్ సహకరించనట్లు తెలుస్తోంది.
Also Read: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్