విఘతజీవులైన నలుగురు..
పూర్తిగా చదవండి..హైదరాబాద్‌కు చెందిన వీరాంజనేయ(31), భార్య హేమావతి(29) దంపతులు తన పిల్లలు మోక్ష మేఘనయనా, శృష్టి సునయనాలతో శిగహళ్లిలోని సాయి గార్డెన్ ఆపార్ట్మెంటులో నివసిస్తున్నారు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వీరు తన ఇద్దరు పిల్లలు, భార్యను హత్య చేసి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని కాడుగోడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాళ్లు ఉంటున్న ప్లాట్ నుంచి వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్లను ఓపెన్ చేశారు. వీరాంజనేయ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించగా భార్య, పిల్లల మృతదేహాలు మరో రూములో ఉన్నాయి. వీరాంజనేయ ముగ్గురిని చంపి అనంతరం అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మనస్పర్థలే కారణం
అయితే.. రెండు రోజులుగా తమ కుమార్తెకు ఫోన్ చేసినా స్పందన రాకపోవటంతో అనుమానం వచ్చిన హైమావతి తల్లిదండ్రులు బెంగుళూరు వెళ్లి చూడగా నలుగురూ విఘతజీవులై కనిపించారు. వెంటనే పోలీసులుకు సమాచారం ఇచ్చారు.భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధల కారణంగా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుని ఉంటారని వారు భావిస్తున్నారు. వీరి నలుగురు మృతదేహాలను ప్రత్యేక వాహనంలో మచిలీపట్నం తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. వీరి మృతితో బందరుకోటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
కుటుంబం చిన్నాభిన్నం
భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి అర్ధం చేసుకునే గుణం లేకుంటే వివాహ బంధం కష్టంగానే ఉంటుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే స్వభావం లేకపోవడం తరచూ గోడవలతో పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు. భార్య మనస్తత్వాన్ని భర్త, భర్త మనస్తత్వాన్ని భార్య అర్థం చేసుకోవాలి..నచ్చకపోతే మార్చుకునే ప్రయత్నం చేయాలి. లేకుంటే ఇలాంటి దారుణలు జరుగుతాయి. నేనే ఎందుకు నిన్ను అర్ధం చేసుకోవాలని ఇద్దరూ అనుకుంటే వివాహ బంధం ముందుకు సాగదు. ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవిచ్చి, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటేనే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకవేళ భాగస్వామి అభిప్రాయాలు నచ్చకపోతే పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి. అంతే కానీ ఎటువంటి ప్రయత్నం చేయకపోతే నిండు జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీనిని ప్రతి ఒకరు అర్థం చేసుకుంటే గొడవలు తగ్గి కుటుంబం చిన్నాభిన్నం కాకుండా ఉంటుంది.
[vuukle]