AP News : నర్సరావుపేట చేరుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు నర్సరావుపేట చేరుకున్నారు. పాల్వాయ్ గేట్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో హైకోర్టు తనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో నర్సరావుపేట వచ్చిన పిన్నెల్లి.. స్థానిక ఎస్పీని‌ కలిసి తాను ఎక్కడ ఉంటున్నాడో పూర్తి వివరాలు తెలియజేశాడు.

New Update
AP News : నర్సరావుపేట చేరుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి!

Macherla : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఎట్టకేలకు నర్సరావుపేట చేరుకున్నారు. పాల్వాయ్ గేట్‌ (Palvai Gate) లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో హైకోర్టు తనకు మధ్యంతర బెయిల్ (Interim Bail) ఇచ్చింది. దీంతో నర్సరావుపేట వచ్చిన పిన్నెల్లి.. స్థానిక ఎస్పీని‌ కలిసి తాను ఎక్కడ ఉంటున్నాడో పూర్తి వివరాలు తెలియజేశాడు.

జూన్ 6 వరకు చర్యలు తీసుకోవద్దు..
ఈ మేరకు పాల్వాయ్ గేట్‌లో ఈవీఎం ధ్వంసం (EVM Issue) చేసిన ఘటన తర్వాత ఐదారు రోజుల కనిపించని ఆయన.. పల్నాడు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. అయితే మంగళవారం రాత్రి నరసరావుపేటకి చేరుకున్న పిన్నెల్లి.. తొలుత హోటల్ జూపల్లి వద్ద ఆగి అక్కడ్నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. పిన్నెల్లికి మద్దతుగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు. ఇక పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేయగా.. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెంబడించగా సంగారెడ్డి జిల్లా కంది హైవేపై కారు మారి పరారయ్యాడు. కారు డ్రైవర్, గన్‌మెన్‌, ఆఖరికి ఫోన్లు కూడా వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆయన విదేశాలకు వెళ్లిపోయారని, తెలంగాణ బీఆర్ఎస్ నేత ఆశ్రయం ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. దీంతో కేసు పరిశీలించిన హైకోర్టు జూన్6 వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీచేయడంతో పిన్నెళ్లికి బిగ్ రిలీఫ్ అయింది.

ఇదిలావుంటే.. హత్యాయత్నం కేసులో పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రెండు హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్నాక తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు.

Also Read : వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు