Maa Oori Polimera 2 on OTT: ఓటీటీలో 'మా ఊరి పొలిమేర 2' రికార్డ్.. 100 మిలియన్ వ్యూవింగ్ మినిట్స్..!

సత్యం రాజేష్ నటించిన 'మా ఊరి పొలిమేర 2' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. డిసెంబర్ 8న ఆహాలో స్ట్రీమైన ఈ చిత్రం రికార్డు వ్యూస్ తో ఓటీటీలో కూడా సత్తాచాటుతుంది. ఇప్పటికే 100 మిలియన్ వ్యూవింగ్ మినిట్స్ దాటేసింది. ఈ విజయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ ను పంచుకుంది.

New Update
 Maa Oori Polimera 2 on OTT: ఓటీటీలో 'మా ఊరి పొలిమేర 2' రికార్డ్.. 100 మిలియన్ వ్యూవింగ్ మినిట్స్..!

 Maa Oori Polimera 2 on OTT: అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మా ఊరి పొలిమేర 2'. నవంబర్ 3న థియేటర్స్ లో విడుదలైంది. 2021లో వచ్చిన 'మా ఊరి పొలిమేర' చిత్రానికి సీక్వెల్ గా 'మా ఊరి పొలిమేర 2' తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ట్విస్టులు, సస్పెన్సెస్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంచనాలకు మించి ఫలితాన్ని రాబట్టిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఓటీటీలో అడుగు పెట్టిన ఈ చిత్రం రికార్డ్ వ్యూస్ తో సత్తాచాటుతుంది.

'మా ఊరి పొలిమేర 2' చిత్రం డిసెంబర్ 8న ఓటీటీ వేదిక 'ఆహాలో' స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు మాత్రం రిలీజ్ తేదీ కంటే 24 గంటల ముందే సినిమా అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో మంచి హిట్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో కూడా దూసుకెళ్తుంది. ఓటీటీలో విడుదలైన 4 రోజుల్లోనే 100 మిలియన్ ప్లస్ వ్యూవింగ్ మినిట్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఓటీటీ వేదిక ఆహా ఈ విజయాన్ని అధికారికంగా షేర్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 'మా ఊరి పొలిమేర 2' OTT రికార్డులను తిరగ రాసింది అంటూ ఆహా ట్వీట్ చేసింది.

publive-image

ఈ చిత్రంలో గెటప్ శ్రీను, బాలదిత్య, కామాక్షి భాస్కర్ల, రవివర్మ కీలక పాత్రల్లో నటించారు. సత్యం రాజేష్ ఈ సినిమాతో మరింత గుర్తింపు పొందాడు. ఈ చిత్రంలో నటీనటుల పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. క్షుద్రపూజలు, క్రైమ్ ఎలిమెంట్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.

Also Read: Salaar Movie: థియేటర్ లో సలార్ ప్రీమియర్ షో నిలిపివేత.. రచ్చ చేసిన ప్రేక్షకులు

Advertisment
Advertisment
తాజా కథనాలు