Luxury Cruiz Ship: సముద్రం లో చిక్కుకుపోయిన లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌!

సముద్రంలో ఆనందంగా, హాయిగా గడుపుదామనుకున్న వారికి అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఓ లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌ (Luxary Cruiz Ship) సముద్రంలో ఓ మూలన చిక్కుకుపోయింది. ఈ షిప్‌ లో 200 మంది ప్రయాణికులతో పాటు 6 గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 1 న మూడు వారాల ట్రిప్‌ కోసం నౌక బయల్దేరి వెళ్లింది.

New Update
Luxury Cruiz Ship: సముద్రం లో చిక్కుకుపోయిన లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌!

A luxury cruise ship stuck in the sea : సముద్రంలో ఆనందంగా, హాయిగా గడుపుదామనుకున్న వారికి అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఓ లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌ సముద్రంలో ఓ మూలన చిక్కుకుపోయింది. ఈ షిప్‌ లో 200 మంది ప్రయాణికులతో పాటు 6 గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 1 న మూడు వారాల ట్రిప్‌ కోసం నౌక బయల్దేరి వెళ్లింది.

అయితే ఇది ఈ నెల 22 ను తిరిగి పోర్టుకు రావాల్సి ఉంది. కానీ గ్రీన్‌ ల్యాండ్‌(Green land)  నుక్‌(Nuuk) కి సుమారు 850 మైళ్ల దూరంలో ఈ నౌక సముద్రంలో చిక్కుకుపోయింది. అందరూ క్షేమంగానే ఉన్నట్లు నౌక సిబ్బంది తెలియజేశారు. అయితే రెస్యూ టీమ్‌ నౌక వద్దకు శుక్రవారం వరకు చేరుకోలేరు.

ఈ ట్రిప్‌ వేయడం కోసం నౌక యాజమాన్యం ఒక్కో ప్రయాణికుని వద్ద నుంచి 27 లక్షలు వసూలు చేశారు. షిప్‌ ఆపరేటర్ ఎప్పటికప్పుడు అక్కడి సంగతులు పోర్టు లోని వారికి తెలియజేస్తున్నారు. అయితే షిప్‌ లో ఉన్న వారిలో కొంత మందికి కరోనా సోకినట్లు ఆయన తెలిపారు.
వారందరినీ కూడా ఓ గదిలో పెట్టి చికిత్స అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

షిప్‌ లో ఓ వైద్యుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. షిప్‌ లో ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఆయన వివరించారు. కొందరేమో షిప్‌ ఆగిపోవడం గురించి ఆందోళన చెందుతుంటే మరి కొందరు మాత్రం ఆగిపోయిన ప్రదేశం చాలా అందంగా ఉంది అంటూ ఆస్వాదిస్తున్నారు.

Also Read: వైరల్ ఫీవర్ ఉంటే స్నానం చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..?

Advertisment
తాజా కథనాలు