Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు.. L&T సంచలన నిర్ణయం!

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను 2026 తర్వాత విక్రయించేందుకు L&T సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఉచిత ప్రయాణం నేపథ్యంలో మెట్రోలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో మెట్రోపై భారం పడుతుందని L$T డైరెక్టర్ ఆర్ శంకర్ రామన్ స్పష్టం చేశారు.

Hyderabad Metro: మెట్రోలో ప్రయాణించేవారికి అలర్ట్.. సమయంలో మార్పులు
New Update

L&T to exit Hyderabad Metro Project: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను విక్రయించేందుకు L&T సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మెట్రోలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిన నేపథ్యంలో 2026 తర్వాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేసేందుకు ఎల్ అండ్ టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఎల్ అండ్ టీ సంస్థ డైరెక్టర్ ఆర్ శంకర్ రామన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ మేరకు మెట్రో ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ వాటా 90 శాతం ఉండగా.. ప్రభుత్వానికి 10 శాతం వాటా ఉంది. అయితే ఈ మెట్రో వ్యవస్థనునడపడానికి కంపెనీకి 65 ఏళ్ల రాయితీ ఉండగా.. మెట్రో భారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని శంకర్ రామన్ అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం ప్రభావం మెట్రోపై పడిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆర్ శంకర్ రామన్ స్పష్టం చేశారు. ఈ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయిందన్నారు. మెట్రో రైళ్లలో ఏర్పాటు చేసిన లేడీస్ కంపార్ట్‌మెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయన్నారు.

#hyderabad-metro #hyderabad-metro-project #lt
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe