Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ ను జారీ చేసింది.

New Update
Telangana : బంగాళాఖాతంలో వాయుగుండం...తెలంగాణ పై ఎంత ప్రభావం అంటే!

Bay Of Bengal : తెలంగాణ (Telangana) లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ ను జారీ చేసింది.

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర ఒడిశా తీరానికి దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీట‌ర్ల ఎత్తులో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ వివరించింది. రాబోయే రెండురోజుల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.

సోమవారం నుంచి మంగళవారం వరకు మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌, వరంగల్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలుచోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. జులై 2 వరకు ఆదిలాబాద్‌, ఆసిఫ్రాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.

ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డిఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కొత్తగూడెం, హన్మకొండ, ములుగు, వరంగల్‌, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో అత్యధికంగా 87 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు సమాచారం.

Also read: ఏపీలో నేటి నుంచే పెరిగిన పెన్షన్ల పంపిణీ.. ఎవరికి ఎంతంటే?

Advertisment
తాజా కథనాలు