Cibil Score: మీకు పర్సనల్ లోన్ కావాలి. కానీ, CIBIL Score తక్కువగా ఉంది. ఇది మీ ఒక్కరి సమస్యే కాదు. చాలా మంది ఇలా తక్కువ CIBIL స్కోర్ తో అవసరమైనపుడు లోన్ దొరకక సమస్యలు ఎదుర్కుంటున్నారు. మీకు ఒకవేళ తక్కువ CIBIL స్కోర్ ఉన్నప్పటికీ పర్సనల్ లోన్ కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ CIBIL స్కోర్ మీ ఫైనాన్షియల్ రిపోర్ట్ కార్డ్ లాంటిది. మీరు మీ డబ్బును ఎంత చక్కగా నిర్వహిస్తున్నారనేదానికి ఇది సూచిక. మీరు మీ బిల్లులను సకాలంలో చెల్లించడం, ఎక్కువ డబ్బు అప్పుగా తీసుకోకపోవడం.. చాలా అప్పులు కలిగి ఉండకపోవడం వంటి విషయాల్లో సరిగ్గా ఉంటె మీ స్కోర్ పెరుగుతుంది. కానీ మీరు తరచుగా మీ బిల్లులు చెల్లించకపోవడం, ఎక్కువ రుణాలు తీసుకోవడం లేదా చాలా అప్పులు చేయడం జరిగితే మీ స్కోర్ తగ్గుతుంది.
ఈ స్కోర్ సాధారణంగా 300-900 మధ్య ఉంటుంది. మీరు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వంటి వాటిని తీసుకోవాలనుకున్నప్పుడు, బ్యాంకులు - లెండర్స్ మీ CIBIL స్కోర్‌ను చూస్తారు. అది ఎక్కువగా ఉంటె మీకు లోన్ వస్తుంది. మంచి డీల్స్ కూడా అందిస్తుంది. అదే స్కోర్ తక్కువ ఉంటె మీ లోన్ రిజెక్ట్ కావచ్చు. ఒక వేళ లోన్ ఇచ్చినప్పటికీ అధిక వడ్డీ రేటును వసూలు చేయవచ్చు.
Also Read: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే దీపావళి కానుక.. పీఎఫ్ పై కీలక ప్రకటన!
CIBIL స్కోర్ తక్కువ ఉన్నా లోన్ కావాలంటే..
సకాలంలో EMI పేమెంట్స్ చేయగలను అని నిరూపించుకోవడానికి మీరు మంచి ఆదాయం కలిగి ఉన్నారని రుజువు చేసుకోవాలి. మీ ఆదాయంలో ఇటీవలి కాలంలో పెంపుదల ఉంటె దానిని రుజువు చేస్తే తక్కువ CIBIL స్కోర్ ఉన్నప్పటికీ పర్సనల్ లోన్ దొరికే అవకాశం ఉంటుంది.
స్థిరమైన ఆదాయం - ఉద్యోగ భద్రతను ప్రదర్శించడం వలన మీ అవకాశాలను పెంచుకోవచ్చు, అయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉండవచ్చని గుర్తుంచుకోండి.
తక్కువ లోన్ మొత్తం కోసం అప్లై చేయండి.
మీరు తక్కువ CIBIL స్కోర్‌తో చిన్న పర్సనల్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు, అది లెండర్ కు రిస్క్ తగ్గిస్తుంది. తక్కువ రిస్క్ అంటే వారు మీ లోన్ అప్లికేషన్‌ను ఆమోదించడానికి ఎక్కువ ఇష్టపడవచ్చు, ఎందుకంటే తక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించడం సులభం అని వారు భావిస్తారు.
గ్యారంటర్‌ను చూపించడం లేదా కో అప్లికెంట్ ను పెట్టుకోవడం ద్వారా కూడా లోన్ పొందడానికి అవకాశం ఉంటుంది. కో అప్లికెంట్ లేదా మంచి CIBIL స్కోర్‌తో హామీదారుని కలిగి ఉండటం వలన తక్కువ క్రెడిట్ స్కోర్ రుణం ఉన్నప్పటికీ లోన్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, మీరు రీపేమెంట్ సరిగ్గా చేయలేకపోతే మీ కో-అప్లికెంట్ లోన్ తిరిగి చెల్లించడానికి బాధ్యత వహించాల్సి వస్తుంది.
ఎప్పుడూ కూడా మీ ఫైనాన్షియల్ హెల్త్ పై దృష్టి పెట్టడం చాలా అవసరం. మీ CIBIL స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ.. ఎప్పుడైనా అది తగ్గినట్టు గమనిస్తే ఎందుకు తగ్గింది అనే అంశాన్ని చెక్ చేసుకుని సరి చేసుకోవడం మంచిది.
Watch this interesting Video: