Honeymoon Places: చీప్‌ అండ్‌ బెస్ట్‌.. లో బడ్జెట్‌లో ఎంజాయ్‌ చేసే హనీమూన్‌ స్పాట్స్‌!

కొత్తగా పెళ్లైందా? మీ భాగస్వామితో కలిసి హనీమూన్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్ తక్కువగా ఉందా? నో టెన్షన్‌.. కేవలం రూ. 10,000లో మీరు హనీమూన్‌కు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్‌ చేయవచ్చు. లో బడ్జెట్‌లో హనీమూన్‌ ప్లేసెస్‌ లిస్ట్‌ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి!

Honeymoon Places: చీప్‌ అండ్‌ బెస్ట్‌.. లో బడ్జెట్‌లో ఎంజాయ్‌ చేసే హనీమూన్‌ స్పాట్స్‌!
New Update

Low Budget Honeymoon Desinations: పెళ్లి తర్వాత ప్రతి అబ్బాయి, అమ్మాయి జీవితం పూర్తిగా మారిపోతుంది. పెళ్లిరోజుల్లోని మంచి జ్ఞాపకాలు జీవితాంతం మనసులో మెదులుతూ ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకే పెళ్లైన జంట వివాహం అవ్వగానే హనీమూన్‌కు వెళుతుంది. నిజానికి చాలామంది పెళ్లికి ముందే ఎక్కడికి వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి అని ప్లాన్ చేసుకుంటారు. హనీమూన్‌కి వెళ్లడం వల్ల దంపతులు ఒకరితో ఒకరు మంచి సమయం గడపుతారు అలసటను మరచిపోయి మరిన్ని మంచి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మీరు కూడా మీ భాగస్వామితో కలిసి హనీమూన్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్ తక్కువగా ఉందా? నో టెన్షన్‌.. కేవలం రూ. 10,000లో మీరు కొన్ని ప్రాంతాలను విజిట్‌ చేయవచ్చు.. ఆ ప్రదేశాల గురించి మేం మీకు చెప్పబోతున్నాం...!

publive-image

హంపి:

హనీమూన్‌కి హంపికు కూడా వెళ్లవచ్చు. ఇది బెంగుళూరుకు 353 కి.మీ దూరంలో ఉంటుంది. ట్రైన్‌ రైలు లేదా బస్సులో హంపిని విజిట్ చేయవచ్చు. బస్సులో పోల్చితే ట్రైన్ టికెట్‌ ధర తక్కువ ఉంటుంది. హంపిలో మీ లైఫ్‌ పార్ట్‌నెర్‌తో కలిసి హ్యాపీగా విజిట్ చేసే అందమైన ప్రదేశాలు ఉన్నాయి.

publive-image

కసౌల్

కసౌల్ ఢిల్లీకి కాస్త దగ్గరలో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా అందమైన హిల్ స్టేషన్ ఇది. అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్లేస్‌గా కసౌల్‌కు మంచి పేరుంది. పెద్ద సంఖ్యలో హనీమూన్ జంటలు ఇక్కడ తరచుగా కనిపిస్తారు. ఈ ప్రాంతం మీకు, మీ భాగస్వామికి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది.

publive-image

ఔలి:

ఉత్తరాఖండ్‌లోని అందమైన హిల్ స్టేషన్ ఇది. ఇక్కడ మీరు మీ భాగస్వామితో కలిసి అందమైన లోయలలో షికారు చేయవచ్చు.

publive-image

ముస్సోరీ:

కాలుష్యం లేని స్వచ్చమైన ప్రకృతిని ఆశ్వాదించడానికి కపుల్స్‌కు ముస్సోరీ ది బెస్ట్‌గా చెప్పవచ్చు. డెహ్రాడూన్ నుంచి ముస్సోరికి 35 కిలోమీటర్లు, హరిద్వార్‌కి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హరిద్వార్ నుంచి ముస్సోరి వరకు అంతా కొండలమీదే ప్రయాణం సాగుతుందా.. ఇది కొత్తగా పెళ్లైన జంటలకు మంచి హనీమూన్‌ డెస్టినేషన్.

Also Read: తిక్క కుదిరింది.. కంట్రాక్ట్‌ లిస్ట్‌ నుంచి అయ్యర్-కిషన్ ఔట్.. ఎందుకంటే?

WATCH:

#marriage-life #honeymoon
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe