/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/lover.jpg)
Vasai Murder: ప్రియురాలిని నడిరోడ్డులో అతి దారుణంగా చంపాడు ఓ ప్రియుడు. ఇనుప రెంచ్‌తో తలపై 14 సార్లు కొట్టి హత్య చేశాడు. ఈ దారుణమైన ఘటన ముంబైలోని (Mumbai) వసాయ్‌లో చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: దారుణం.. మొదటి భార్య కోసం రెండో భార్యను చంపిన భర్త.!
వివరాల్లోకి వెళితే.. నిందితుడు రోహిత్ యాదవ్ (Rohit Yadav), మృతురాలు ఆర్తి యాదవ్ ఇద్దరు ప్రేమికులు. గత కొన్ని రోజుల క్రితం వీరిద్దరు విడిపోయారు. అయితే, బాధిత యువతి వేరే అబ్బాయితో చనువుగా ఉంటుందని రోహిత్ తెలుసుకున్నాడు. ప్రియురాలు తనని మోసం చేస్తుందని తెలుసుకున్న ప్రియుడు ఆమెను వెంబడించి మరి హత్య చేశాడు.
Also Read: ముగ్గురుతో ప్రేమాయణం.. పెళ్లి చేసుకోమన్నాడని కన్నతండ్రిని చంపిన కూతురు..!
చించ్‌పాడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతిపై దాడి చేస్తుండగా ఓ వ్యక్తి తప్ప అక్కడ ఉన్న వారు ఎవరూ అడ్డుకోవడానికి సాహసించలేదు. అడ్డుకోబోయిన వ్యక్తిని సైతం యువకుడు రోహిత్ కొట్టబోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వలీవ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు రోహిత్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు.