OTT : ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నవదీప్ హీరోగా రీసెంట్ గానే 'లవ్ మౌళి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ జూన్ 7 న థియేటర్స్ లో రిలీజై యూత్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతుంది. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ‘ఆహా’లో జూన్‌ 27వ తేదీ నుంచి 'లవ్ మౌళి' మూవీ స్ట్రీమింగ్‌ కానుంది.

OTT : ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
New Update

Love Mouli Movie OTT Release : టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్ (Navdeep).. తన సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు. రీసెంట్ గా రవితేజ 'ఈగల్' మూవీలో కనిపించిన నవదీప్.. మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత హీరోగా రీసెంట్ గానే 'లవ్ మౌళి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కోసం నవదీప్ బాగానే కష్టపడ్డాడు. టీజర్, ట్రైలర్ లో కాస్త బోల్డ్‌ కంటెంట్‌ ఉండటంతో ప్రేక్షకుల్లో కూడా కాస్త అంచనాలు పెరిగాయి.

love-mouli

రిలీజ్ కు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ జూన్ 7 న థియేటర్స్ లో విడుదల అయింది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నవదీప్ ఈ సినిమాలో కనిపించిన విధానం, అతని క్యారెక్టరైజేషన్ కు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. రిలేషన్‌లో ఉన్న ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది.

Also Read : ఓటీటీలో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ వివాదాస్పద చిత్రం.. ? స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఆహాలో...

థియేటర్స్ లో యూత్ ను ఇంప్రెస్ చేసిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ లోకి రాబోతుంది.

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ‘ఆహా’లో (Aha) జూన్‌ 27వ తేదీ నుంచి 'లవ్ మౌళి' మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'ఆహా' సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ మధ్య బోల్డ్ కంటెంట్ తో ఉండే సినిమాలకు ఓటీటీలో భారీ ఆదరణ దక్కుతుంది. 'లవ్ మౌళి' కి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.

#love-mouli-ott-release #hero-navdeep
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe