OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'లవ్ మీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆశిష్ రెడ్డి, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'లవ్ మీ'. రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

New Update
OTT : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'లవ్ మీ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Love Me OTT Release : ఈమధ్య సినిమాలు ఓటీటీ (OTT) లోకి చాలా త్వరగా వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్ రన్ పూర్తికాకుండా కూడా సైలెన్స్ గా ఓటీటీలో ప్రత్యక్షం అయిపోతున్నాయి. దాదాపుగా ప్రతివారం ఒక కొత్త సినిమా ఓటీటీలోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చేస్తోంది. ఎటువంటి సమాచారం.. హంగామా లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ (Amazon Prime Videos) లో ప్రీమియర్ అవుతోంది.

సినిమా విడుదల పై ఎటువంటి సమాచారం లేకుండానే చప్పుడు కాకుండా స్ట్రీమింగ్ కి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ సినిమా మరేదో కాదు. దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి (Ashish Reddy), బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ 'లవ్ మీ, ఇఫ్ యూ డేర్'.

Also Read : ప్రభాస్ ‘కల్కి’ పై కాపీ మరక.. ప్రూఫ్స్ తో సహా బయటపెట్టిన కొరియన్ ఆర్ట్ డిజైనర్!: 

అమెజాన్ ప్రైమ్ లో...

అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా 'లవ్ మీ' మూవీ తెరకెక్కింది. అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ మూవీ మే 25న థియేటర్స్ లో రిలీజై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

publive-image

ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సైలెన్స్‌గా ఓటీటీలోకి వచ్చిన 'లవ్‌ మీ' (Love Me) ఆడియన్స్ ని ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగమల్లిడి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు