Vishakha triangle love story:విశాఖపట్నంలో బేబీ సినిమాను తలపిస్తున్న ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. మూడు కుటుంబాల్లో కడు విషాదాన్ని మిగిల్చింది. ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయి తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పిదానికి మూడు నిండు జీవితాలు బలైపోయాయి. ఒకే సమయంలో ఇద్దర్ని ప్రేమించిన ఆ అమ్మాయి అందులో నుంచి ఒకర్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అదే సమయంలో మరొకరితోనూ.. ప్రేమను సాగించింది. చివరికి ఈ ట్రయాంగిల్ ప్రేమ ఆమెనే బలితీసుకుంది. మరోవైపు ఆమెను ప్రేమించిన పాపానికి ఒకరు బలవన్మరణానికి పాల్పడగా.. మరొకరు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి దాపురించింది.
ఆర్టీవీ దగ్గర ట్రై యాంగిల్ లవ్ స్టోరీ సూసైడ్ లెటర్..కొత్త ట్విస్ట్!
ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సూసైడ్ లెటర్ ఆర్టీవీ దగ్గర ఉంది. అయితే ఈ లెటర్ ఈ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ ను ఇచ్చే విధంగా ఉంది. సూర్య ఎవరినీ వదలకు, అందరూ.. కుక్క చావు చావలి అంటూ లెటర్ చివరిలో బాలిక రాయడం ట్విస్ట్ గా మారింది. కాగా, ఆత్మహత్య ముందు అమ్మాయి లవర్ సూర్యకు లెటర్ రాసింది. అందులో సూర్యను.. నువ్వు నా ఫ్యావరెట్ పర్సన్.. నాకు ఏమైనా సరే.. నువ్వు జాగ్రత్త అంటూ పేర్కొంది. నేను లేక పోయినా నా ఆత్మ నీకు తోడు గా ఉంటుందని రాసింది. నువ్వు నా రక్తం.. నువ్వు నా ప్రాణం.. నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్పింది. మళ్లీ జన్మలో ఏ కుక్క గానో పిల్లి గానో పుడుతానని, తల్లిదండ్రులు ఇద్దరు నాకు చాలా ఫ్రీడం ఇచ్చారని.. మీ నలుగురు జాగ్రత్త అంటూ లెటర్ లో ప్రస్తావించింది.
అసలేం జరిగిందంటే..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈ మధ్యే రిలీజ్ అయిన బేబీ సినిమాను తలపిస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే.. కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందిన 16 ఏళ్ల అమ్మాయి వైజాగ్ లోని ఓ జూనియర్ కాలేజ్ ఇంటర్ చదువుతోంది. ఆమె ఆదర్శ నగర్ కు చెందిన సూర్యప్రకాశ్ ఇంకా ఇందిరా నగర్ కు చెందిన లెంకా సాయి కుమార్ తో ప్రేమలో పడింది. ఇద్దరితో చనువుగా..ప్రేమగానే ఉండేది. ఈ క్రమంలో సాయికుమార్ ఓ రోజు ఆ అమ్మాయి మెడలో రహస్యంగా తాళి కట్టాడు. దాని తరువాత కూడా ఆమె సూర్య ప్రకాశ్ తో కూడా ప్రేమగా ఉండేది. దీంతో అమ్మాయి ఇంకా తాళి కట్టిన సాయికుమార్ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఇక ఇలా ఉంటే.. సాయికుమార్ ఇంకా ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్న ఫోటోలు, వీడియోలు సూర్యప్రకాశ్ కంట్లో పడ్డాయి. దీంతో సూర్య ప్రకాశ్ కూడా ఆమెతో గొడవకు దిగాడు.
ఇంతలో ఓ రోజు సాయికుమార్ ఇంకా సూర్య ప్రకాశ్ వేర్వేరు సమయాల్లో అమ్మాయి ఇంటికి వచ్చారు. మాలో ఎవరితో ఉంటావో.. నువ్వే డిసైడ్ చేసుకోవాలని ఇద్దరు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె రెండ్రోజుల తరువాత ఆగష్టు 10 న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రియుడు సూర్యప్రకాశ్ ఆత్మహత్య..
ఇక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియడంతో.. పోలీసుల విచారిస్తారని.. కేసులని భయపడి సూర్యప్రకాశ్ శుక్రవారం గోపాలపట్నం రైల్వే ట్రాక్ దగ్గర రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ దొరికిన డెడ్ బాడీ తమ కుమారుడిదేనని సూర్య ప్రకాశ్ తల్లిదండ్రులు శనివారం గుర్తించారు. దీంతో ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది.
ప్రియుడు సాయికుమార్ అరెస్ట్..
ఇక ఇంటర్ చదువుతున్న మైనర్ అమ్మాయిని రహస్యంగా పెళ్లాడిన సాయికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు. మైనర్ ను ప్రేమించాలని ప్రేరేపించి, రహస్యంగా పెళ్ళి చేసుకున్నందుకు సాయికుమార్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ప్రేమ విషయంలో అటో.. ఇటో తేల్చుకోవాలని మా అమ్మాయిని ఒత్తిడి చేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఓ మైనర్ బాలిక తెలిసీ తెలియకుండా చేసిన తప్పుకు మూడు కుంటుంబాల్లో విషాదమే మిగిలింది.