Telangana Police: నిరుద్యోగులపై పోలీసుల జూలుం.. ఖాకీల తీరుపై తీవ్ర విమర్శలు!

TG: రాష్ట్రంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, జర్నలిస్టుల పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఓయూలో ఓ విద్యార్థిని చుట్టుముట్టి, భూతులు తిడుతూ 20 మంది కానిస్టేబుళ్లు చితకబాదారు. దీనిపై రేవంత్ స్పందించాలని ప్రతిపక్షలు డిమాండ్ చేస్తున్నాయి.

New Update
Telangana Police: నిరుద్యోగులపై పోలీసుల జూలుం.. ఖాకీల తీరుపై తీవ్ర విమర్శలు!

Telangana Police: తెలంగాణలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, జర్నలిస్టుల పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. ఇటీవల వరుస ఘటనలతో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. ఓయూలో విద్యార్థులపై పిడిగుద్దులు, బూతులు ఉపయోగించారు పోలీసులు. ఓ విద్యార్థిని చుట్టుముట్టి 20 మంది కానిస్టేబుళ్లు చితకబాదారు. జర్నలిస్టులపైనా పోలీసుల ప్రతాపం చూపించారు. తాజాగా ఓయూలో ఓ జర్నలిస్టును లాక్కెళ్లి జీపులో ఎక్కించారు పోలీసులు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర కూడా ఓ మహిళా జర్నలిస్టుతో పోలీసుల దురుసుగా ప్రవర్తించారు.

కాగా.. గత కొన్ని రోజులుగా గ్రూప్ -2, 3, DSC పరీక్ష వాయిదా వెయ్యాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనలు దిగారు. ఇటీవల ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. పరీక్షల వాయిదా అంశాన్ని TGPSC, విద్యాశాఖ పరిశీలిస్తుందని చెప్పారు. దీంతో పరీక్షలు వాయిదా పడుతాయని నిరుద్యోగులు ఆశించారు.. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటన విడుదల కాలేదు. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్.. కొని కోచింగ్ సెంటర్లు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయని అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తె నిరుద్యోగులకు నష్టం కలుగుతుందని అన్నారు. దీంతో పరీక్షలు వాయిదా వేసే అవకాశం లేదన్న సంకేతాలు ఇచ్చారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. మరోవైపు కోదండరాం కూడా పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

పోలీసుల తీరుపై హరీష్ ఆగ్రహం..

ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు . డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? అని నిలదీశారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అని ధ్వజమెత్తారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు