Anger: కోపంతో ఊగిపోతున్నారా? కారణం ఇదే కావచ్చు !

తరుచూ కోపం వస్తే అది కచ్చితంగా విటమిన్‌ బి6, బి12 లోపమే. కోపం తగ్గాలంటే జంక్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. విటమిన్లు తగిన స్థాయిలో లేకపోతే కోపంతోపాటు నిరాశ, నీరసం, డిప్రెషన్, అలసట లాంటివి కలుగుతాయి. కోపం వస్తే ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే క్రమంగా కోపం తగ్గిపోతుంది.

Anger: కోపంతో ఊగిపోతున్నారా? కారణం ఇదే కావచ్చు !
New Update

Anger: మనుషులన్న కోపం వస్తుంది. కాలు జారితే తీసుకోగలం కానీ.. నోరు జారితే తీసుకోలేం. కోపం అంటే అదేమి పుట్టుకతో వచ్చింది కాదు. కొంతమంది మాట్లాడే విధానం నచ్చక కోపం వస్తుంది. సాధారణంగా ఉప్పు ఎక్కువ తింటే కోపం ఎక్కువ వస్తుందని అంటారు. కానీ కొన్ని విటమిన్‌ లోపం వల్ల కూడా కోపం వస్తుదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సందర్భంలోనూ చిరాకు పడినా..? ప్రతి చిన్న విషయానికీ కోపంతో వచ్చినా..? అది ఖచ్చితంగా విటమిన్ బి6, బి12 లోపం. శరీరంలో వివిధ హార్మోన్లు, విటమిన్ల లోపం ఉంటే సాధారణంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ ప్రత్యేకించి విటమిన్ బి6, బి12 విటమిన్ల లోపం ఉంటే మాత్రం కోపం పెరగడం, నిర్లక్ష్యం, బీపీ, షుగర్ వంటి సమస్యలు వస్తాయని పరిశోధలకు తెలుపుతున్నారు.

మెదడు పనితీరు తగ్గుతుంది:

మెదడును చురుకుగా, కూల్‌గా ఉంచడంలో విటమిన్ బి6, బి12 అనేవి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆహారంలో విటమిన్‌ ఎక్కువగా ఉన్న పదార్థలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ విటమిన్లు తగిన స్థాయిలో లేకపోతే కోపంతోపాటు నిరాశ, నీరసం, డిప్రెషన్, అలసట వంటి కలుగుతాయి. కొందరిలో విటమిన్ల లోపం వలన ఇలాంటి ఆలోచనలు రావడానికి కూడా ఈ రెండు ముఖ్య కారణం అంటున్నారు. దీనికి తోడు శరీరంలో జింక్‌, మెగ్నీషియం లోపాలు కూడా సంభవిస్తే మెదడు పనితీరు తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్జీమర్స్, డిప్రెషన్, నెగెటివ్ థింకింగ్స్ మరింత పెరిగిపోతాయి. కావునా.. వారానికి మించి మీలో చికాకు, కోపం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే విటమిన్ బి6, బి12 లోపాలు ఉన్నాయని అర్థం. విలైనం త్వరగా వైద్యులను సంప్రదించి చెక్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అంకెలతో కోపానికి విరుగుడు:

కోరుకున్నది దొరక్కపోవడం, ఇష్టమైనది జరగకపోవడం, చెప్పిన మాటలను ధిక్కరించడం, అంచనాలు తప్పిపోవడం, ఇష్టం లేనిది జరగటం, మాటకు మాట అందివ్వడం ఇలా కోపానికి కారణాలు సవాలక్ష కారణాలున్నాయి. కొందరు కోపం వస్తే తమలో తాము బాధపడిపోయి గింజుకుంటారు. కోపం వచ్చిందన్న సంగతి ఇతరులకు అర్థం కాక పోగా, కుటుంబీకులు బంధువులు, మిత్రులు అపార్థం చేసుకుంటారు. ఒక్కోసారి కోపంలో ఏం మాట్లాడుతున్నామో మనకే అర్ధం కాదు. అందుకే కోపం వచ్చినప్పుడు ప్రతి మాటకు ముందు రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు కోపానికి అతిసులువైన విరుగుడు అంకెలను లెక్కపెట్టడమే అని సూచిస్తున్నారు. కోపం వస్తే ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే క్రమంగా కోపం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: చలికాలంలో బరువును తగ్గించే బెస్ట్‌ సూప్స్‌..ట్రై చేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #anger
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe