Cricket in Olympics: ఒలింపిక్స్ లో క్రికెట్ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది. 128 ఏళ్ల తర్వాత క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చారు. ముంబైలో సమావేశమైన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అమెరికాలో 2028లో జరగనున్న లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉండనుంది. టీ20 ఫార్మెట్‌లో క్రికెట్‌ని ఆడనున్నారు. క్రికెట్‌తో పాటు మరో నాలుగు క్రీడలకు IOC ఆమోదం తెలిపింది. వీటిలో బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్ ఉన్నాయి. 2028 ఒలింపిక్స్‌లో ఈ ఐదు క్రీడలు ఎంట్రీ ఇవనున్నాయి.
ఇండియా ఆనందం:
క్రికెట్ ఎక్కడుంటే ఇండియా (India) అక్కడంటుంది. రీసెంట్‌గా ముగిసిన ఆసియా గేమ్స్ క్రికెట్‌లోనూ ఇండియా సత్తా చాటింది. స్వర్ణ పతకాం గెలుచుకుంది. ఇక ప్రస్తుతం వరల్డ్‌కప్ సీజన్ నడుస్తోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఇండియా మూడింటిలోనూ విక్టరీ సాధించింది. ఈ సారి టీమిండియా వరల్డ్‌కప్ సాధిస్తుందని ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో క్రికెట్‌ని ఒలింపిక్స్‌లో చేర్చాడం అభిమానులను ఖుషీ చేసింది. 2028 లాస్ ఏంజిల్స్ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై IOC సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ ఆనందం వ్యక్తం చేశారు. '1.4 బిలియన్ల భారతీయులకు, క్రికెట్ అనేది ఒక క్రీడ కాదు, ఇది ఒక మతం! కాబట్టి ఈ చారిత్రాత్మక తీర్మానం పట్ల నేను సంతోషిస్తున్నాను. ఇది క్రికెట్‌కు పెరుగుతున్న అంతర్జాతీయ ప్రజాదరణకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది...' అని కామెంట్ చేశారు.
ఇండియా అక్కడ కూడా గెలవాలి:
టీమిండియా ఇప్పటివరకు రెండు వన్డే ప్రపంచకప్‌లు గెలుచుకుంది. ఒక టీ20 కప్ గెలిచింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC)ని మాత్రం గెలవలేకపోయింది. ఇప్పటివరకు రెండు సార్లు WTC ఇప్పటివరకు రెండుసార్లు జరిగితే రెండు సార్లూ కూడా ఫైనల్‌కి వెళ్లిన టీమిండియా తుది మెట్టుపై మాత్రం బోల్తా పడింది. ఇక ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌కప్‌ను టీమిండియా సాధిస్తే ముచ్చటగా మూడు సార్లు కప్ సాధించినట్టు అవుతుంది. 2028లోపు టీమిండియా WTC టైటిల్ సాధించాలను అభిమానులు కోరుకుంటున్నారు. అప్పుడు 2028లో జరిగే ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధిస్తే ఇక టీమిండియాకు తిరుగుండదు.
ALSO READ: రోహిత్ శర్మ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ స్వరూపమే మరిపోయింది భయ్యా..నువ్వు కేక బ్రో!