Accident: ఏపీలో దారుణం.. బైక్‌ను 20 కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ.. అసలేమైందంటే?

పార్క్‌ చేసి ఉన్న బైకును ఢీకొట్టిన లారీ ఆ ద్విచక్ర వాహనాన్ని 20 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు లారీని ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

New Update
Accident: ఏపీలో దారుణం.. బైక్‌ను 20 కి.మీ ఈడ్చుకెళ్లిన లారీ.. అసలేమైందంటే?

Accident to Eluru district:ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఆరు బైకులను ఢీ కొట్టింది. అంతటితో ఆగలేదు.. ఢీకొట్టిన తర్వాత కూడా బైకులను ఈడ్చుకెళ్లింది. ఏ 500 మీటర్లో.. 1,000 మీటర్లో ఈడ్చుకెళ్లిందనుకుంటే పొరపాటే.. సోయి లేకుండా ఏకంగా 20కి పైగా కిలోమీటర్లు లారీ బైక్‌ను ఈడ్చుకెళ్లింది. తర్వాత పోలీసులు అడ్డుపడితే కానీ డ్రైవర్‌ లారీని ఆపలేదు.

మద్యం సేవించి ఉన్నాడా?
నిజానికి రాత్రి వేళల్లో మందు తాగి డ్రైవింగ్‌ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఏపీ అయినా తెలంగాణ అయినా ఇండియా అయినా ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం, డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌. కొయ్యలగూడెం గ్రామంలో బీభత్సం సృష్టించిన లారీ డ్రైవర్‌ కూడా మందు తాగి ఉన్నాడానన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఒకటి రెండు కిలోమీటర్లు నిద్రమత్తులో బైక్‌ను ఈడ్చుకెళ్లడంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అతను 20కిలోమీటర్లు బైక్‌ను టైర్‌ కింద వేసుకోని ఈడ్చుకెళ్లాడు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నిస్తే వాళ్లను కూడా ఢీకొట్టబోయాడు.

Also Read: అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఇదే..బంగారు సింహాసనం రహస్యం తెలుసా..?

మరోవైపు భయంతో అంత దూరం ఈడ్చకెళ్లాడన్న వాదన కూడా వినిపిస్తోంది. ఆరు బైక్‌లను ఢీకొట్టినప్పుడు అందులో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అతనికి ఏమైనా జరిగిందేమోనన్న భయంతో లారీని ఆపకుండా డ్రైవ్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. పోలీసులు ఆపుతుంటే కూడా అందుకే ఆగకుండా వెళ్లేందుకు ప్రయత్నించి ఉండొచ్చని తెలుస్తోంది. ఇటు కాకినాడ జిల్లా తాళ్లరేవులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ట్రాక్టర్‌ను బైక్‌ ఢీకొట్టడంతో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు.

Also Read: ఉద్యోగాలపై నిరుద్యోగి ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై.. మంత్రి చెప్పిన లెక్కలివే!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు