Loose Dress: లూజ్ డ్రెస్సెస్ ఇప్పుడు ఫ్యాషన్ బాసూ.. ఈ బట్టలతో ఎంతో ఆరోగ్యం కూడా! ఒకప్పుడు బట్టలు టైట్‌గా ఉంటే ఫ్యాషన్ అనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కాస్తా లూజ్‌గా ఉండే డ్రెస్సెస్‌ను వేసుకునేందుకు యూత్ ఇష్టపడుతోంది. లూజ్‌గా ఉండే బట్టలు వేసుకుంటే చర్మ సమస్యలు దరి చేరవు. చర్మానికి వెంటిలేషన్ అందుతుంది. చెమట, చెమట వాసన ఎక్కువగా రాదు. By Vijaya Nimma 28 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Loose dresses very healthy: బట్టల విషయానికి వస్తే ఎన్నో ఎన్నో ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటారు. ఒకప్పుడు బట్టలు టైట్‌గా ఉంటే ఫ్యాషన్ అనేవారు. కానీ..ఇప్పుడు ట్రెండ్స్ మారింది. కాస్తా లూజ్‌గా ఉండే డ్రెస్సెస్ ప్రజెంట్ ట్రెండ్స్‌లో ఉంది. చాలామంది లూజ్‌గా ఉండే బట్టలు వేసుకుంటే లుక్స్ అతగా బాగోవని పెద్దగా ఇష్టపడరు. కానీ.. ఇప్పుడు ఎక్కువ మంది కంఫర్ట్‌నెస్‌ని ఉండేలా చూసుకుంటున్నారు. సినీ సెలబ్రిటీలు వదులుగా ఉండే బట్టల్ని స్టైల్ చేసి పోజులివ్వడంతో ఎక్కువ మంది లూజ్ బట్టల్ని వేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే.. ఈ లూజ్ బట్టల కోసం మళ్ళీ షాపింగ్ చేయాల్సిన పని లేదు. ఇంట్లో వారి బట్టల్ని స్టైల్ చేయొచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సురిపోతుంది. లూజ్ బట్టలతో లాభాలు: లూజ్‌గా ఉండే బట్టలు వేసుకుంటే చర్మ సమస్యలు దరి చేరవు. చర్మానికి వెంటిలేషన్ అందుతుంది. అంతేకాదు చెమట, చెమట వాసన ఎక్కువగా రాదు. లూజ్ టీ షర్ట్: లూజ్ టీ షర్ట్ ఎంత కంఫర్ట్‌తోపాటు ఫ్యాషన్‌గా ఉంటుంది. లూజ్‌గా ఉండే టీ షర్ట్స్ క్యాజువల్ లుక్‌ని ఇస్తుంది. వీటికి మ్యాచింగ్‌గాషార్ట్స్, బ్యాగీ ప్యాంట్స్, కార్గో ప్యాంట్స్ వేసుకోవచ్చు. లూజ్ ప్యాంట్స్: లూజ్ ప్యాట్స్‌ని కాస్తా టైట్‌గా ఉండే టాప్స్, ఫన్నీ షర్ట్స్, క్రాప్ టాప్‌తో వేసుకోవచ్చు. అదే విధంగా.. లూజ్ ప్యాట్స్ వేసుకుంటే వాటిపైకి షూస్ వేసుకుంటే మంచి లుకింగ్‌గా కనిపిస్తారు. బీచ్ లుక్: లూజ్‌గా ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే మంచి బీచ్ లుక్‌ని ఇస్తాయి. ఇందుకోసం లూజ్ మ్యాక్సీ డ్రెస్ వేసుకుంటే బాగుటుంది. పార్టీ లుక్ ఇవ్వడానికి బెల్ట్, బూట్స్, పేర్ అప్‌తో పాటు షార్ట్ ప్యాంట్, మినీ టిప్స్, లూజ్ టీ షర్ట్స్, షర్ట్స్ స్టైల్ చేయొచ్చు. లూజ్ షర్ట్: లూజ్ బట్టలు వేసుకోవాలంటే ముందుగా మీకు లూజ్ షర్ట్‌తో పాటు లోపలై సరైన ఇన్నర్స్ వేసుకోవాలి. తర్వాత ఈ షర్ట్‌ని స్కిన్నీ ఫిట్ జీన్స్, స్కర్ట్స్, ప్యాంట్స్‌తో పేర్ అప్ చేసుకోవాలి. వీటిని ఎలివేట్ చేయాలంటే మంచి బెల్ట్, బూట్స్ వేసుకుంటే మంచి లూక్‌గా ఉంటారు. కుర్తీ: లూజ్ కుర్తీలు వేసుకోవచ్చు. ఈ కుర్తీని స్టైల్ చేసే ముందు సెట్ అవుతుందో లేదో ఒక్కసారి చూసుకోవాలి. అదే విధంగా, కొన్ని మెటీరియల్స్, కాటన్ కుర్తీలు అందరికీ సెట్ రావు. కావున.. కుర్తీని సెలక్ట్ చేసుకుంటే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వీటితోపాటు లూజ్ బట్టలు వేసుకున్నప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మంచి కలర్ కాంబినేషన్స్, ఎంచుకున్న డ్రెస్సెస్‌కి సరిపోయే షూ, యాక్సెసరీస్, మేకప్ కూడా డీసెంట్‌గా ఉండేలా చూసుకోవాలి. Also Read: దాల్చినచెక్క, నిమ్మకాయను ఇలా తీసుకుంటే చాలు.. బరువు మొత్తం తగ్గుతారు..! #health-benefits #loose-dresses #new-fashion మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి