BRS Party : టార్గెట్ వరంగల్ ఎంపీ.. బీఆర్ఎస్ నుంచి ఆ మహిళా నేతకు ఛాన్స్?

గెలుపే లక్ష్యంగా వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి కోసం కసరత్తు సాగుతోంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, తెలంగాణ ఉద్యమకారిణి స్వప్న పేరును బీఆర్ఎస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

BRS Party : టార్గెట్ వరంగల్ ఎంపీ.. బీఆర్ఎస్ నుంచి ఆ మహిళా నేతకు ఛాన్స్?
New Update

Warangal : కడియం శ్రీహరి(Kadiyam Srihari), ఆయన కూతురు కడియం కావ్య(Kadiyam Kavya) కాంగ్రెస్ లో చేరడంతో.. బీఆర్ఎస్(BRS) పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిపై కసరత్తు ముమ్మరం చేసింది. కాంగ్రెస్(Congress) క్యాండిడేట్ కడియం కావ్యను ఢీకొట్టడమే లక్ష్యంగా అనేక మంది పేర్లను పరిశీలిస్తోంది. తాజాగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్నను బరిలోకి దించితే ఎలా ఉంటుందన్న చర్చ బీఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. పెద్దిస్వప్న(Peddi Swapna) నల్లబెల్లి నుంచి జడ్పీటీసీగా గెలుపొందారు.
ఇది కూడా చదవండి: వరంగల్ లో కాంగ్రెస్ మీటింగ్.. హాజరైన కడియం

పార్టీ ఫ్లోర్ లీడర్ గా కూడా ఉన్నారు. తెలంగాణ(Telangana) ఉద్యమంలో కూడా పని చేశారు స్పప్న. ఉమ్మడి జిల్లాలోని ఉద్యమకారులు, కేయూ జేఏసీ నేతలో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టడానికి స్వప్న సరైన అభ్యర్థి అన్న చర్చ బీఆర్ఎస్ లో సాగుతోంది. ఈ అంశంపై ఒకటి లేదా రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఉద్యమం నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి జిల్లాలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. 2018లో సుదర్శన్ రెడ్డి నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

#brs #kadiyam-srihari #kadiyam-kavya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe