Telangana Game Changer : ఆదిలాబాద్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Telangana Game Changer : ఆదిలాబాద్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

Lok Sabha Elections 2024 : ఆదిలాబాద్(Adilabad) లోక్ సభ ఎన్నికల ఫలితాలపై రవిప్రకాశ్(Ravi Prakash) విశ్లేషణ ఆయన మాటల్లోనే.. తెలంగాణ(Telangana) కు ఎంట్రీ పాయింట్‌ ఆదిలాబాద్‌. గిరిజన, ఆదివాసీల ఆధిపత్యం కలిగిన ఈ లోక్‌సభ నియోజకవర్గం పలు రకాలుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజాం దురహంకార పరిపాలనలో జరిగిన అకృత్యాలపై పోరాడిన కొమురం భీం వారసత్వం కలిగిన ఈ జిల్లాలో ఒకప్పుడు నక్సలిజం ప్రాబల్యం గణనీయంగా వుండేది. గత ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ(BJP) విజయం సాధించిన ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఇపుడు ఆదివాసీ, గిరిజన, గోండులు ఎటువైపు మొగ్గితే వారిదే విజయంగా కనిపిస్తోంది.

2019లో బీజేపీ అభ్యర్ధి సోయం బాపూరావు ఇక్కడ గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్ధి గోడం నగేష్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు. 2019లో లంబాడీలు, ఆదివాసీ తెగల మధ్య విభేదాల్ని బీజేపీ క్యాష్ చేసుకోగలిగింది.

ప్రస్తుతం కాంగ్రెస్(Congress) నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు.

కాంగ్రెస్: 
ఆత్రం సుగుణ - వృత్తిరీత్యా టీచర్. గిరిజన హక్కుల కోసం పోరాడుతున్న యాక్టివిస్టుగా పేరుంది.

బీజేపీ: 
గోడం నగేష్ - చిరకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, రాష్ట్రమంత్రిగా చేశారు. ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారు.

బీఆర్ఎస్:
ఆత్రం సక్కు - బీఆర్ఎస్ నుంచి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా చేశారు.

గెలిచే అవకాశం: కాంగ్రెస్‌

Also Read : తండ్రే కొడుకును చంపిన వైనం..ఆరేళ్ళ పిల్లాడితో జిమ్ చేయించిన తండ్రికి శిక్ష

కారణాలు:
1. ఆత్రం సుగుణ క్లీన్‌ ఇమేజ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణకు కలిసి వస్తుంది.
2. టీచర్‌గా సుగుణకు ఆ ట్రైబల్‌ ఏరియాలో మంచి పేరుంది.
3. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంటు విషయంలో ఫలించిన వ్యూహం ఆదిలాబాద్‌ లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసింది.
4. కాంగ్రెస్‌ అభ్యర్థినికున్న పాజిటివ్‌ ఇమేజ్‌కి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నగేశ్‌ నెగెటివ్‌ అంశాలు కాంగ్రెస్‌ పార్టీకి కలిసి వస్తున్నాయి.
5) నగేశ్‌ గతంలో చాలా పదవులు అనుభవించినా ఎవరికీ ఏమీ ఉపయోగపడలేదనే టాక్‌.
6) నిర్మల్‌, భైంసా, ఆదిలాబాద్‌ టౌన్‌ బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి మిగిలిన సెగ్మెంట్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపుతున్నాయి.
7) నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలున్నా.. నగేశ్‌ సానుకూలంగా మల్చుకోలేకపోతున్నాడు. అభ్యర్థే బీజేపీకి మైనస్‌ పాయింట్‌
8) ఆసిఫాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ హవా కనిపిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు