Renuka Chowdary : ఖమ్మం కాంగ్రెస్ లో కొట్లాటకు కారణమిదే.. రేణుకా చౌదరి సంచలన ఇంటర్వ్యూ

ఖమ్మంలో తాను వేసిన పునాదులపైనే ఇప్పుడు నేడు అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారన్నారు రేణుకాచౌదరి. ఖమ్మంలో కొత్తగా చేరిన వారి వాళ్ల పాత కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఆర్టీవీకి రేణుక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

Renuka Chowdary : ఖమ్మం కాంగ్రెస్ లో కొట్లాటకు కారణమిదే.. రేణుకా చౌదరి సంచలన ఇంటర్వ్యూ
New Update

Khammam : ప్రజాబలం లేని వాళ్లు, ప్రజాక్షేత్రంలో గెలవలేని వారు బ్యాక్ డోర్ ద్వారా పార్లమెంట్(Parliament) లోకి వస్తున్నారంటూ ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడడం శోచనీయమన్నారు కాంగ్రెస్(Congress) ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి(Renuka Chowdary). ఆయనకు పార్లమెంట్, రాజ్యాంగం అంటే ఏంటో తెలిసుంటే ఇలా మాట్లాడేవారు కాదన్నారు. తాను శాశ్వతంగా ఖమ్మం జిల్లా ఆడబిడ్డనేనన్నారు. ఆ జిల్లా అభివృద్ధి కోసం తాను చేసిన పనులు ఇంకా మరెవరూ చేయలేదన్నారు. ఖమ్మంలో తాను వేసిన పునాదులపైనే ఇప్పుడు నేడు అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారన్నారు. ఖమ్మంలో కొత్తగా చేరిన వారి వళ్ల పాత కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు.

మెరిట్ ప్రకారమే రఘురాంరెడ్డికి టికెట్..
ఖమ్మం పాలిటికల్స్ లో మంత్రి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి ఆధిపత్యం కొనసాగుతుందంటూ వస్తున్న వార్తల్లో వస్తవం లేదన్నారు. రామసహాయం రఘురాంరెడ్డికి మెరిట్ ప్రకారమే ఖమ్మం ఎంపీ టికెట్ దక్కిందన్నారు. కాంగ్రెస్ కు సేవ చేసిన కుటుంబం వారిదన్నారు. ఆస్తులను పేదల కోసం దానం చేసిన కుటుంబం వారిదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడికి టికెట్ ఇవ్వడాన్ని కార్యకర్తలు అంగీకరించలేదన్నారు.

అందరినీ సంప్రదించి రఘురాంరెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు. ఈ నిర్ణయంపై కార్యకర్తలంతా సంతోషంగా ఉన్నారన్నారు.తన వారసులు ఎవరూ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు రేణుక. కాంగ్రెస్ కార్యకర్తలంతా తన రాజకీయ వారసులేనన్నారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అభ్యర్థిత్వంపై తాను సంతృప్తిగా ఉన్నానన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.

Also Read : మాజీ ఎమ్మెల్యే కూతురిపై అత్యాచారం.. రూ. 6 కోట్లు వసూల్!

కమ్మ వారికి టికెట్లు అడిగింది వాస్తవమే..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కమ్మ సామాజిక వర్గం వారికి టికెట్లు ఇవ్వాలని తాను లాబీయింగ్ చేసిన మాట వాస్తవమేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కమ్మ సామాజిక వర్గం వారికి టికెట్ ఇవ్వాలని పార్టీని కోరానన్నారు. తెలంగాణలో RR ట్యాక్స్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో పచ్చి అబద్ధాలు మాట్లాడిన ఘనత ఆయనదన్నారు. రేణుకాచౌదరి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

#renuka-chowdary #2024-lok-sabha-elections #congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి