నరసాపురం టికెట్ నాకే.. మరో 3 రోజుల్లో కూటమి నుంచి అధికార ప్రకటన: RRR
నరసాపురం పార్లమెంటు స్థానానికి తప్పనిసరిగా పోటీ చేస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. కూటమి నుంచి మరో మూడు రోజుల్లో ఈ మేరకు ప్రకటన వస్తుందన్నారు. అసెంబ్లీకి తాను పోటీ చేయనని ప్రకటించారు.
రానున్న ఎన్నికల్లో తాను ఎన్డీఏ కూటమి నుంచి నరసాపురం పార్లమెంటు స్థానానికి కచ్చితంగా పోటీలో ఉంటానని రఘురామకృష్టం రాజు (RRR) సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు తనకు తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి తరపున న్యాయం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లోగా ఎన్డీఏ కూటమి నుండి నిర్ణయం వెలువడుతుందన్నారు. అసెంబ్లీ బరిలో అయితే తాను ఉండనన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాను వేసిన కేసులు ఏప్రిల్ ఒకటో తేదీన ట్రయల్ కు వస్తున్నాయన్నారు. ఇప్పటికే మూడు వేల సార్లు జగన్మోహన్ రెడ్డి వాయిదాలు కోరానన్నారు.