/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Medak--jpg.webp)
రానున్న ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పై కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఈ రోజు సిద్దిపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు రైలును తీసుకువచ్చిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కే దక్కుతుందన్నారు. తాను సిద్దిపేట గడ్డపైనే పుట్టానని, ఇక్కడే చదువుకున్నానన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తన గెలుపు కోసం సిద్దిపేట నేతలు కూడా కష్టపడ్డారని గుర్తు చేశారు.