Lok Sabha Elections 2024 : హాట్‌టాపిక్‌గా కొండా అఫిడవిట్.. ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల ఆస్తులంటే?

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి అఫిడవిట్ హాట్ టాపిక్ గా మారింది. తనకు రూ.4,568 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల 70 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇంకా.. అపోలో హస్పటల్స్ లో భారీగా షేర్లు ఉన్నాయి.

New Update
Lok Sabha Elections 2024 : హాట్‌టాపిక్‌గా కొండా అఫిడవిట్.. ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల ఆస్తులంటే?

Konda : బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) అఫిడవిట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన ఆస్తుల వివరాలు చూసి షాక్ అవుతున్నారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. కుటుంబ ఆస్తుల విలువ రూ.4,568 కోట్లుగా పేర్కొన్నారు. తన పేరిట, తన భార్య పేరిట ఉన్న ఆస్తులను ఆయన పేర్కొన్నారు. తన పేరు మీద రూ.1178.72 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే తన భార్య సంగీతారెడ్డి పేరు మీద రూ.3,203.90 కోట్ల ఆస్తులను ప్రకటించారు. తన భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Loksabha Elections 2024: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి ఫుల్ రిచ్.. ఆయన ఆస్తులు ఎన్ని వేల కోట్లో తెలుసా?

స్థిరాస్తులు రూ.71.34 కోట్లు
విశ్వేశ్వర్‌ రెడ్డికి స్థిరాస్తులు రూ.71.34కోట్లు, విశ్వేశ్వర్‌ రెడ్డి భార్య సంగీతారెడ్డి చరాస్తులు రూ.3.6 కోట్లు, ఆయన కొడుకు విరాజ్‌ మాధవ్‌ చరాస్తులు రూ.1.27 కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే, అప్పులు చాలా తక్కువ ఉన్నట్లుగా చూపారు. విశ్వేశ్వర్‌ రెడ్డి తన అప్పు రూ.1.76కోట్లుగా పేర్కొన్నారు. అలాగే, ఆయన భార్య సంగీతారెడ్డి అప్పులు రూ.12 కోట్లు ప్రకటించారు. విశ్వేశ్వర్‌ రెడ్డికి, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తుల్లో ఎక్కువ భాగం అపొలో హస్పిటల్స్‌ గ్రూపు(Apollo Hospitals Group) నకు సంబంధించిన షేర్లే. విశ్వేశ్వర్‌రెడ్డికి అపోలోలో రూ.973కోట్ల విలువైన షేర్లు ఉండగా, ఆయన భార్యకు రూ.1500 కోట్ల విలువైన షేర్లున్నాయి.

కలిసివచ్చిన అపోలో షేర్లు:
గత లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల నాటి నుంచి ఇప్పటివరకు అపోలో గ్రూపు షేర్లు స్టాక్‌మార్కెట్‌లో దూసుకుపోవడంతో మాజీ ఎంపీ ఆస్తుల విలువ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇక భూముల విషయానికి వస్తే.. విశ్వేశ్వర్‌రెడ్డికి హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల మొత్తం 70 ఎకరాల భూమి ఉంది, ఆయన భార్యకు 14 ఎకరాల భూమి ఉంది. ఇవి కాకుండా 45,432 స్క్వేర్‌ ఫీట్ల విస్తీర్ణం గల నివాస భవనాలున్నాయి. ఇక వాణిజ్య భవనాల విషయానికి వస్తే బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12లో ఒకటి, ఉస్మాన్‌గంజ్‌లో 14 షాపులు, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 86లో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఉన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు