Khammam: వియ్యంకుడి విజయం కోసం.. మే 7న ఖమ్మంలో హీరో వెంకటేష్ ప్రచారం!

ఖమ్మం ఎంపీగా బరిలో ఉన్న తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి విజయం కోసం ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ రంగంలోకి దిగనున్నారు. మే 7న ఆయన ఖమ్మం రానున్నారు. రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.

New Update
Khammam: వియ్యంకుడి విజయం కోసం.. మే 7న ఖమ్మంలో హీరో వెంకటేష్ ప్రచారం!

Hero Venkatesh Election Campaign: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డి ప్రముఖ టాలీవుడ్ హీరో వెంకటేష్ కు స్వయానా వియ్యంకుడు. రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులుండగా.. వారిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను పెళ్లి చేసుకున్నాడు. చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె సప్నరెడ్డిని వివాహం చేసుకున్నారు. దీంతో.. రఘురాంరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ప్రకటించిన నాటి నుంచి ఆయన విజయం కోసం వెంకటేష్ ప్రచారానికి వస్తారన్న చర్చ మొదలైంది.

తాజాగా వెంకటేష్ ప్రచార షెడ్యూల్ సైతం ఖరారైంది. ఈ నెల 7న వెంకటేష్ ఖమ్మంకు రానున్నారు. ఆ రోజు రామసహాయం రఘురాంరెడ్డికి మద్దుతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటేష్ ప్రచారం తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. వెంకటేష్ ఏం మాట్లాడుతారు? కేవలం రఘురాంరెడ్డిని గెలిపించాలనే కోరుతారా? లేదా ఇతర పార్టీలపై విమర్శలు చేస్తారా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

Also Read: భట్టి Vs రేణుక.. ఖమ్మం కాంగ్రెస్ మీటింగ్ లో రచ్చ రచ్చ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు