మెదక్ రోడ్ షో లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో నేను వస్తా... దమ్ముంటే నువ్వు వస్తావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీతో పాటు ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా అని సవాల్ విసిరారు. రాజీనామా లేఖలను ఇద్దరం మేధావులు చేతిలో పెడదామన్నారు. నువ్వు చెప్పినవి అమలు చేస్తే నా రాజీనామా లేఖను ఆ మేధావులు స్పీకర్ కు ఇస్తారన్నారు. చేయకుంటే నీ రాజీనామా లేఖను గవర్నర్ కు ఇస్తారన్నారు. మాట మీద నిలబడే వాడివి అయితే రేవంత్ రావాలన్నారు. రాకుంటే తెలంగాణ ప్రజలకు వాస్తవం అర్థం అవుతుందన్నారు. కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని తోక ముడిచినట్టే.. ఇప్పుడు కూడా అదే అవుతుందన్నారు. 25 ఏళ్లుగా మెదక్ పార్లమెంట్ పై గులాబీ జెండా తప్పా వేరే జెండానే లేదన్నారు. మెదక్ జిల్లా గులాబీ అడ్డా అని అన్నారు. ఇక్కడ మళ్లీ బీఆర్ఎస్ గెలవబోతోందన్నారు.
దమ్ముంటే అమరవీరుల స్థూపం దగ్గరికి రా.. రేవంత్ కు హరీశ్ సంచలన సవాల్
అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా పత్రంతో నేను వస్తా... దమ్ముంటే నువ్వు వస్తావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. మెదక్ లో ఈ రోజు నిర్వహించిన రోడ్ షో లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
New Update
Advertisment