Lok Sabha Election-2024: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే!

పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణలో సెగ్మెంట్ల ఆధారంగా ఇంఛార్జీలను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. 15 నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకే అప్పగించగా.. జహీరాబాద్ బాధ్యతలను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ బాధ్యతలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించింది.

Lok Sabha Election-2024: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే!
New Update

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ (AICC) నుంచి ప్రకటన విడుదలైంది. సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) చేవెళ్ల, మహబూబాబాద్ బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లకు ఇంఛార్జీగా నియమించింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivas Reddy) ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఖమ్మంతో పాటు మహబూబాబాద్ లో పార్టీని గెలిపించే బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్. ఇంకా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కూడా వారు గతంలో ఎంపీలుగా గెలిచిన నల్గొండ, భువనగిరి స్థానాల బాధ్యతలు అప్పగించారు. ఆదివాసీలు అధికంగా ఉండే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను మంత్రి సీతక్కకు అప్పగించారు.
ఇది కూడా చదవండి: Telangana: జిల్లాల పునర్విభనపై సీఎం కీలక ప్రకటన

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి..
ఆదిలాబాద్:
సీతక్క
పెద్దపల్లి: శ్రీధర్ బాబు
కరీంనగర్: పొన్నం ప్రభాకర్
నిజామాబాద్: టీ.జీవన్ రెడ్డి
జహీరాబాద్: పీ.సుదర్శన్ రెడ్డి
మెదక్: దామోదర్ రాజనర్సింహ
మల్కాజ్ గిరి: తుమ్మల నాగేశ్వరరావు
సికింద్రాబాద్: భట్టి విక్రమార్క
ఇది కూడా చదవండి: JOBS : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాలు భర్తీ?

హైదరాబాద్: భట్టి విక్రమార్క
చేవెళ్ల: రేవంత్ రెడ్డి
మహబూబ్ నగర్: రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్: జూపల్లి కృష్ణారావు
నల్గొండ: ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్: కొండా సురేఖ
మహబూబాబాద్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

#congress #cm-revanth-reddy #2024-lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe