Barrelakka: పార్లమెంట్ బరిలో బర్రెలక్క.. ఆ అభ్యర్థులకు ఇక చుక్కలేనా?

బర్రెలక్క శిరీష ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ సీటు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో బర్రెలక్కకు ఏ మేరకు మద్దతు లభిస్తుంది? ఎవరి ఓట్లను ఆమె చీలుస్తారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

New Update
Barrelakka: పార్లమెంట్ బరిలో బర్రెలక్క.. ఆ అభ్యర్థులకు ఇక చుక్కలేనా?

Barrelakka Filed Nomination For Lok Sabha Elections: గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షించారు బర్రెలక్క. ఆమెకు తెలంగాణతో పాటు ఏపీలోని నిరుద్యోగులు, యువత నుంచి కూడా మద్దతు లభించింది. జేడీ లక్ష్మినారాయణ కూడా బర్రెలక్కకు మద్దతు ప్రకటించి ఆమె తరఫున ప్రచారం చేశారు. ఓ దశలో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో బర్రెలక్క తమ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తుందోన్న ఆందోళన కనిపించింది.
ఇది కూడా చదవండి: BRS Politics: శంకర్ నాయక్ Vs కవిత: మానుకోట బీఆర్ఎస్ లో మళ్లీ భగ్గుమన్న వర్గపోరు

హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో 5,754 ఓట్లు సాధించిన బర్రెలక్క.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల తర్వాత 4వ స్థానంలో నిలిచారు. ఆ సమయంలోనే తాను ఎంపీగా సైతం పోటీలో ఉంటానని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఈ రోజు నాగర్ కర్నూల్ ఎంపీగా ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు.

ఇదిలా ఉంటే.. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ ను ప్రధాన పార్టీలు ఛాలెంజ్ గా తీసుకున్నాయి. సొంత జిల్లాలోని సీటు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న డిప్యూటీ సీఎం సోదరుడు, మల్లు రవి గెలుపుకోసం ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి రిటైర్డ్ అధికారి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ పోటీలో ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు