Mahabubabad : మహబూబాబాద్ బీఆర్‌ఎస్‌లో(BRS Party) మరోసారి వర్గపోరు బయటపడింది. ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య మళ్లీ వార్ చోటు చేసుకుంది. కార్యకర్తల సమావేశంలోనే వేదికపై ఈ ఇరువురు వాగ్వాదానికి దిగారు. ఈ రోజు కవిత(Kavitha) నామినేషన్ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో చేసిన తప్పులు మళ్లీ చేయొద్దని సూచించారు శంకర్ నాయక్. దీంతో శంకర్‌నాయక్ నుంచి ఎంపీ కవిత మైక్ తీసుకున్నారు. తనను మాట్లాడినవ్వకపోవడంపై శంకర్ నాయక్ తీవ్ర ఆగ్రహం చేశారు. తేల్చుకుందామా? అంటూ వేదికపైనే నేతల్ని ప్రశ్నించారు శంకర్ నాయక్. సీనియర్లు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు ఈ మాజీ ఎమ్మెల్యే.
ఇది కూడా చదవండి: Loksabha Elections 2024: హాట్‌టాపిక్‌గా కొండా అఫిడవిట్.. ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల ఆస్తులంటే?
BRS Politics : శంకర్ నాయక్ Vs కవిత : మానుకోట బీఆర్ఎస్ లో మళ్లీ భగ్గుమన్న వర్గపోరు
గత కొన్ని రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మానుకోట బీఆర్ఎస్ లో వర్గ పోరు మరోసారి బయటపడింది. కార్యకర్తల సభలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ అభ్యర్థి కవిత వేదికపైనే వాగ్వాదానికి దిగారు. ఎంపీ ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ ఘటన హైకమాండ్ కు తలనొప్పిగా మారింది.
Translate this News: