Lok Sabha : వరంగల్(Warangal) నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమైన ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్‌కు(Babu Mohan) బిగ్‌షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ ను తిసర్కరణకు గురైంది. నామినేషన్(Nomination) లో ప్రతిపాదితుల సంతకాలు లేకపోవడంతో అధికారులు తిరస్కరించారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి మొత్తం 58 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా.. అందులో పది మంది నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు అధికారులు. ఈ విషయంపై బాబుమోహన్ ఇంకా స్పందించలేదు. గత అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో బాబుమోహన్ ఉమ్మడి మెదక్ జిల్లాలోని అందోలు అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం ఆ పార్టీని వీడి ప్రజాశాంతి పార్టీలో చేరారు.
Lok Sabha Elections 2024 : బాబుమోహన్ కు బిగ్ షాక్.. పోటీ నుంచి ఔట్!
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబుమోహన్ దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించారు అధికారులు. ప్రతిపాదితుల సంతకాలు లేకపోవడంతో ఆయన నామినేషన్ ను అధికారులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.
New Update
Advertisment