Khammam Politics: ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో మస్త్ పోటీ.. రేసులో రేణుకా, వీహెచ్ తో పాటు ఇంకా ఎవరంటే?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరితో పాటు సీనియర్ నేత వీహెచ్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందినికి టికెట్ ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Khammam Politics: ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లో మస్త్ పోటీ.. రేసులో రేణుకా, వీహెచ్ తో పాటు ఇంకా ఎవరంటే?
New Update

ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District) కాంగ్రెస్ కంచుకోట అని ఈ ఎన్నికల్లో మరోసారి నిరూపించారు ఆ పార్టీ నేతలు. 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీఆర్ఎస్ గాలి వీచినా.. ఈ జిల్లాలో మాత్రం ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో జిల్లాలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టారు. అశ్వరావుపేట, సత్తుపల్లిలో కాంగ్రెస్ పొత్తుతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా.. మిగిలిని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే.. మధిర నుంచి గెలిచిన భట్టి విక్రమార్క మినహా మిగతా ఎమ్మెల్యేలంతా గులాబీ గూటికి చేరిపోయారు. కానీ ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 2018 నాటి సీన్ ను రిపీట్ చేశారు ఖమ్మం ఓటర్లు. బీఆర్ఎస్ ను మళ్లీ ఒక్క సీటుకే పరిమితం చేశారు.
ఇది కూడా చదవండి: శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి బిగ్ షాక్ .. తొమ్మిది కేసులు నమోదు

భద్రాచలం మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్రపక్ష అభ్యర్థులే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో దీంతో ఖమ్మం ఎంపీ టికెట్ కు కాంగ్రెస్ లో పోటీ పెరిగింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే స్థానాల్లో ఖమ్మం ఎంపీ సీటు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉండడమే ఇందుకు కారణం. దీంతో అలర్ట్ అయిన నేతలు టికెట్ కన్ఫర్మేషన్ కోసం రంగంలోకి దిగారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే వ్యూహాలకు పదును పెడుతున్నారు.

గతంలో ఇక్కడి నుంచి రెండు సార్లు విజయం సాధించి.. కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన రేణుకా చౌదరి టికెట్ తనకు పక్కా అన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు కూడా ఇక్కడి నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇదే చివరి అవకాశం అంటూ ఏఐసీసీకి ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. వీరితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో పాలేరులో పొంగులేటి గెలుపుకోసం అన్నీతానై పని చేశారు ప్రసాద్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని సైతం ఖమ్మం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మధిర నియోజకవర్గంలో కొన్నేళ్లుగా యాక్టీవ్ గా ఉన్నారు నందిని. భట్టి తరఫున అనేక ఎన్నికల్లో ఆమె ప్రచారం చేశారు.

#khammam #ponguleti-srinivas-reddy #politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి