CM Revanth : అనుచరుడి కోసం రంగంలోకి రేవంత్‌.. ఓ మెట్టు దిగి నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి..

భువనగిరి ఎంపీగా అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఓ మెట్టుదిగి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించడం కోసమే రేవంత్ ఆయన నివాసానికి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

CM Revanth : అనుచరుడి కోసం రంగంలోకి రేవంత్‌.. ఓ మెట్టు దిగి నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి..
New Update

Raja Gopal Reddy : తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raja Gopal Reddy) ఇంటికి వెళ్లనున్నారు. గతంలో వీరిద్దరి గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆ గ్యాప్ మరింత ఎక్కువైంది. అయితే.. అనంతరం జరిగిన పరిణామాల్లో రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్(Congress) లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అప్పటి నుంచి వీరి మధ్య మంచి సబంధాలు ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తనతో పాటు తన సోదరుడు ప్రాతినిధ్యం వహించిన భువనగిరి పార్లమెంట్ టికెట్ ను తను సూచించిన వారికి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి తన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడంపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Minister Seethakka: ఏపీలో పొత్తులపై మంత్రి సీతక్క షాకింగ్ కామెంట్స్

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఓ మెట్టు దిగి రాజగోపాల్ ఇంటికి వెళ్లడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు గెలవాలని రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. రెండు స్థానాల్లోనూ సీఎం రేవంత్ తన అనుచరులకే టికెట్లు ఇప్పించుకున్నారు. నల్లగొండలో జానారెడ్డి తనయుడు రఘువీర్ విజయం ఖాయమని రేవంత్ కు రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం. భువనగిరిలో కూడా చామల కిరణ్ గెలిచి తీరాలని రేవంత్ పట్టుదలతో ఉన్నారు.

అయితే.. భువనగిరి పార్లమెంట్‌పై కోమటిరెడ్డి బ్రదర్స్‌కి పట్టు ఉంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా.. ఒక సారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మరోసారి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. దీంతో వారికి ఈ ఎంపీ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గట్టిగా తలుచుకుంటే చామల విజయం ఖాయమని రేవంత్ భావిస్తున్నారు.

దీంతో ప్రస్తుతం ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సికింద్రాబాద్‌కు పంపి రాజగోపాల్ రెడ్డికి ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. చామల కిరణ్‌ని గెలిపించే బాధ్యత రాజగోపాల్‌పైనే రేవంత్ పెట్టినట్లు తెలుస్తోంది. తన అనుచరుడు చామల కిరణ్ గెలుపునకు రాజగోపాల్‌ సహకరిస్తాడో లేదో అన్న ఆందోళనలో రేవంత్ ఇంకా ఆందోళనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి ఇంటికి రేవంత్ వెళ్తున్నట్లు సమాచారం.

#congress #cm-revanth-reddy #komatireddy-raja-gopal-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe