/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/lokesh-2.jpg)
Minister Lokesh: ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి నారా లోకేష్ అభినందించారు. రాత్రింబవళ్లు.. దాదాపు 64 గంటల పాటు నిద్రాహారాలు మాని వర్షం వచ్చినా.. వరద వచ్చినా లెక్కచేయకుండా దగ్గరుండి మంత్రి నిమ్మల రామానాయుడు చేయిస్తున్న బుడమేరు గండ్ల పూడిక పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు.
Also Read: దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మళ్లీ రచ్చ..!
ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ శభాష్ అంటూ ప్రశంసించారు. నిన్నటికే రెండు గండ్లు పూడిక జరగగా నేడు మూడోగండి పూడిక జరగడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జరిగిన పనుల తీరును లోకేష్ కు మంత్రి రామానాయుడు వివరించారు.
 Follow Us
 Follow Us