Kamal Haasan Birthday:వెండితెర లోకనాయకుడు..నటనకు ప్రాణం పోసే కమల్ హసన్ బర్త్ డే టుడే.

లోక నాయకుడు ఒక్కడే. ఎన్ని భాషల్లో ఎంత మంది నటులు వచ్చినా అతనిని బీట్ చేయలేరు. తన కంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకుని...దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కమల్ హసన్ పుట్టిన రోజు నేడు.

Kamal Haasan : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. రాజ్యసభకు కమల్ హాసన్?
New Update

Kamal Haasan Birthday Special: ఏదైనా వెరైటీ పాత్ర చేయాలంటే అతనొక్కడే...ప్రయోగాలు చేయాలంటే అతనే...ఎవ్వరికీ రాని ఆలోచన చేయాలంటే అది కూతా అతనొక్కడి వల్లే అవుతుంది. అతనే లోక నాయకుడు. నటనలో దేన్నైనా సుసాధ్యం చేయగల అసాధారణ యాక్టర్. దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని భారతీయుడు. ప్రయోగాలు, విభిన్నపాత్రలకు ఆయనే నాయకుడు. తన యాక్టింగ్ తో ఆడియన్స్ కు దశావతారం చూపిస్తున్న లోకనాయకుడు. ఈ రోజు ఈ విశ్వ నటుడు కమల్ హసన్ (Kamal Haasan) పుట్టినరోజు. ఈరోజు ఆయన 69 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు.

publive-image

Also Read: అందరికీ వెన్నెలలు పంచే చంద్రుడు ఎలా పుట్టాడో తెలుసా..

భారతదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి నటుడు. అవార్డు రాకపోతేనేమి అంతకు మించి రివార్డులు అందుకున్న ఉత్తమ యాక్టర్. కేవలం నటుడిగానే కాకుండా...దర్శకుడిగా, నిర్మాతగా ,స్క్రీన్ ప్లే రైటర్ గా, కథకుడిగా, గాయకుడిగా, డాన్సర్ గా వెండితెరపై చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక వ్యక్తికి ఇన్నింటిలో ప్రావీణ్యం ఉండడం అంటే మాటలు కాదు. మనం చేస్తున్న పని మీద ప్యాషన్ ఉంటేనే అది జరుగుతుంది. కమల్ (Kamal Haasan) కు అది నూటికి రెండొందల శాతం ఉందనే చెప్పాలి. ఇపుడు మక్కల్ నీది మయ్యమ్ అనే రాజకీయ పార్టీతో పాలిటిక్స్‌లో ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఎక్కడున్నా తన కంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటాడు. నలుగురిలో ఒకరిలా బతకడం కమల్ తీరు కాదు. నలుగురూ అతని గురించే మాట్లాడుకునేలా చేయడమే ఆయన స్టైల్.

publive-image

మరోచరిత్ర’, ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’, ‘ఇంద్రుడు చంద్రుడు’,‘శుభ సంకల్పం’.. తెలుగులో ఆయన చేసిన కొన్ని ఆణిముత్యాల్లాంటి సినిమాలు. ఇవి చాలు.. నటుడిగా ఆయన స్టామినా ఏమిటో చెప్పడానికి. అంతేకాదు నటుడిగా 60 ఏళ్ళకు పైగా నట ప్రస్థానం. బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీఆర్,జెమినీ గణేషన్ వంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశారు. యవ్వనంలో డాన్స్ డైరెక్టర్ కమ్ ఫైటర్ గా పనిచేశారు. తర్వాత భాషా బేధం పాటించకుండా నటుడిగా వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటించారు. 1974లో మలయాళంలో వచ్చిన కన్యాకుమారీ కమల్ ను సక్సెస్ ఫుల్ హీరోను చేసింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీలో తిరుగులేని కథానాయకుడిగా ఇప్పటికీ సత్తా చాటుతూనే ఉన్నారు.ఏ భాషలోకి వెళితే ఆ భాషలో వారు కమల్ ను తమవాడిగా చెప్పుకుంటారు అదీ ఆయన ప్రత్యేకత.

publive-image

ఒక కేరెక్టర్ చేస్తే అందులో కమల్ కనిపించరు. తనే ఆ పాత్రలో మౌల్డ్ అయిపోతాడు. మానసింగా, శారీరకంగా దాన్ని బాగా స్టడీ చేసి నటించడంలో కమల్ తర్వాతే ఎవరైనా. తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో ‘స్వాతి ముత్యం’ (Swathi Muthyam),‘సాగర సంగమం’,‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాల్లో నటనకు మూడు నంది అవార్డులను అందుకున్న ఏకైక పరభాష నటుడిగా కమల్ హాసన్ రికార్డు సాధించారు.

దశావతారం (Dasavatharam) సినిమాలో పది పాత్రలతో మెప్పించిన లోక నాయకుడు కమల్ హాసన్. నవరసాలు ఆయనకు కొట్టిన పిండి. దశావతారాలు పోషించడంలో దిట్ట. విశ్వరూపం చూపడంలో అనితరసాధ్యుడు. కమల్ పేరెత్తకుండా భారతీయ ఉత్తమ చిత్రాల గురించి మాట్లాడ్డం వీలు కాదు. స్టార్ డమ్, ఇమేజ్ చట్రాలేమిటో ఆయనకు తెలియవు. అందుకే ఆర్ట్, కమర్షియల్ సినిమాలను ఏకం చేసిన నటులలో కమల్ అగ్రగణ్యుడు అనే చెప్పాలి.

k1, k2, k3, k4, k5

జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు కమల్ హాసన్. ఎన్నో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న కమల్ హాసన్...1954, నవంబర్ 7న తమిళనాడుకు చెందిన, రామనాథపురం జిల్లా, పరమకుడిలో జన్మించారు కమల్ హాసన్. తన ఆరేళ్ళ వయసులో ‘కలత్తూర్ కన్నమ్మ’ (Kalathur Kannamma) అనే సినిమాతో.. బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించాడు. కమల్ ఉత్తమంగా నటించడం.. అక్కడి నుంచే మొదలైంది. భామనే సత్యభామనే, విచిత్ర సోదరులు, పుష్పక విమానం లాంటి సినిమాలు చేయడం ఒక్క కమల్ వల్లనే సాధ్యం అవుతుంది. తరువాత ఎంత మంది నటులు వీటని ట్రై చేసినా ఆయనను మాత్రం ఎవ్వరూ బీట్ చేయలేకపోయారు, చేయలేరు కూడా.

నాయకుడు చిత్రంలో కమల్ నటన గురించి అయితే నో వర్డ్స్. బయోగ్రఫికల్ స్కెచ్ గా సాగే ఈ మూవీలో.. అన్ని వయసుల పాత్రలను అద్భుతంగా నటించి.. యూనివర్శల్ యాక్టర్ గా పేరు సాధించాడు కమల్ హాసన్. అందుకే ఈ సినిమా.. టైమ్ మాగ్జైన్ వారి ‘ఆల్ టైం బెస్ట్’ హండ్రెడ్ మూవీల్లో ఒకటిగా నిలిచింది.

publive-image

కమల్ తన కెరీర్లో.. మొత్తం 171 అవార్డులు పొందారు. అందులో 18 ఫిలిం ఫేర్ లున్నాయి (18 FilmFare Awards). ఉత్తమ బాల నటుడిగా ఒకటి, ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. ఆసియా ఫిలిం ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్ గానూ నిలిచారు. ఆయన నటించిన ఆరు చిత్రాలను.. ఆస్కార్ అవార్డుకు పంపించారు. భారతదేశంలో మరే నటుడికీ ఈ గౌరవం దక్కలేదు. తమిళనాడు ప్రభుతవం వారిచే కలైమామణి అవార్డు (Kalaimamani Award), గౌరవ డాక్టరేట్‌లు పొందాడు. భారత ప్రభుత్వం 1990లో.. పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. 2004లో కేంద్రంనుంచి పద్మభూషణ్ అవార్డు (Padma Bhushan Award) అందుకున్నారు. ప్రస్తుతం కమల్ హసన్ భారతీయుడు 2, మణి రత్నం డైరక్షన్ లో థగ్ లైఫ్ అనే సినిమాల్లో నటిస్తున్నారు.

#kamal-haasan #kamal-haasan-birthday
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe