Lok Sabha Speaker : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జూన్‌ 26 నే!

పార్లమెంట్ తొలి సెషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత.. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనున్నట్టు లోక్‌సభ సెక్రటేరియెట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నిక జరగనున్న ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాము మద్దతు ఇచ్చే సభ్యుడి పేరును సెక్రటరీ జనరల్‌కు తెలియజేస్తామని చెప్పింది.

New Update
Parliament Sessions : రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు షురూ

Lok Sabha Speaker Election : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (General Elections Results) విడుదలైన తరువాత లోక్‌ సభ స్పీకర్‌ (Lok Sabha Speaker) గా ఎవరూ బాధ్యతలు స్వీకరిస్తారనే అని దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి నుంచి ఇప్పటివరకు ఎవరి పేరూ బయటకు తీసుకుని రాలేదు.

ఈ సస్పెన్స్ కొనసాగుతుండగానే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక తేదీ ఖరారైంది. పార్లమెంట్ తొలి సెషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత.. అంటే జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనున్నట్టు లోక్‌సభ సెక్రటేరియెట్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నిక జరగనున్న ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తాము మద్దతు ఇచ్చే సభ్యుడి పేరును సెక్రటరీ జనరల్‌కు రాతపూర్వకంగా తెలియజేస్తామని స్పష్టం చేసింది.

కాగా లోక్‌సభ సమావేశాల్లో మొదటి రెండు రోజులను కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి కేటాయించనున్నారు. ఇక జూన్ 24 నుంచి జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు (Parliament Meetings) జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల నూతన మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మొదటి రెండు రోజులపాటు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం లేదా లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతుందని, అనంతరం స్పీకర్‌‌ను ఎన్నుకుంటారని పేర్కొన్నారు.

జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ (PM Modi) తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని సమాచారం. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో ప్రధాని మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also read: రైలు ప్రయాణికులకు తీపి కబురు…అక్కడ రద్దైన రైళ్ల పునరుద్ధరణ

Advertisment
Advertisment
తాజా కథనాలు