డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లును జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో ఆగస్టు 3వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
New Update

Lok Sabha passes Digital Personal Data Protection Bill 2023 : డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లును జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో ఆగస్టు 3వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దీంతో పెద్దల సభ ఆమోదం కోసం రాజ్యసభకు పంపించనున్నారు. లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. బిల్లు ఆమోదయాగ్యంగా లేదని.. అనేక మార్పులు చేశారని విమర్శలు చేస్తూ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే సభలో బీజేపీ(BJP) సభ్యుల బలం ఎక్కువగా ఉండటంలో బిల్లు సూనాయాసంగా పాస్ అయింది.

194 దేశాల్లో.. 137 దేశాలు..

దేశ పౌరుల డేటా భద్రత కోసం ప్రపంచంలోని ప్రతి దేశం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఇండియా (India) కూడా అడుగులు వేస్తోంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్(DPDP )2023 బిల్లును పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి దేశం తమ పౌరుల డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా డేటా రక్షణ, గోప్యత కోసం ప్రత్యేకంగా చట్టాలు తయారు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 194 దేశాల్లో 137 దేశాలు డేటా ప్రొటెక్షన్ చట్టాలు రూపొందించుకున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఇండియా కూడా అడుగులు వేస్తోంది. దాదాపు ఐదేళ్లు దేశంలోని ప్రముఖ కంపెనీలు, వివిధ సంఘాలు, ప్రజలతో చర్చలు జరిపింది. అనంతరం ఈ చట్టంలో అనేక మార్పులు చేశారు.

రూ.250కోట్ల వరకు జరిమానా..

ఐరోపా తరహాలో డేటా గోప్యతా పాటించేలా ముసాయిదా చట్టం రూపొందించారు. ఈ చట్టం ద్వారా మన డేటా ఎక్కడ ఉపయోగిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని కంపెనీల సూచనలు, విన్నపాల నేపథ్యంలో అమెరికా చట్టాల తరహాలో కొద్దిపాటి మార్పులు చేశారు. ఇన్ని సార్లు చట్టంలో మార్పులు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారం DPDP (Digital Personal Data Protection Bill) నిబంధనల్ని ఉల్లంఘించిన ప్రతిసారీ సంబంధిత సంస్థలు రూ.250 కోట్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏదైనా వివాదాలు తలెత్తితే దానిపై డేటా పరిరక్షణ మండలి(DPB) నిర్ణయం తీసుకుంటుంది.

ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర అభ్యంతరం.. 

అలాగే తమ డేటా గోప్యతకు భంగం వాటిల్లితే పరిహారాన్ని కోరుతూ ప్రజలు సివిల్‌ కోర్టుల్ని ఆశ్రయించవచ్చు. డేటాను సేకరిస్తున్న తీరుతో పాటు సమాచారాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారో అడిగే హక్కు ప్రజలకు ప్రభుత్వం కల్పించింది. కచ్చితంగా డేటా స్వీకారానికి ప్రజల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కంపెనీలు, యాప్స్‌, వ్యాపార సంస్థలు మరింత జవాబుదారీతనంగా వ్యవహరిస్తాయి. మరోవైపు డిజిటల్ పర్సనల్ బిల్లుపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి.. 

పత్రికా స్వేచ్ఛతో పాత్రికేయులపై డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని వాపోయింది. బిల్లులోని నిబంధనలు పౌరులపై నిఘాకు విధి విధానాలను సృష్టించనున్నాయంది. దీని వల్ల మీడియా ప్రతినిధులకు సమాచారమిచ్చే వ్యక్తులు ప్రభావితమవుతారని పేర్కొంది. ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి నివేదించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసింది. వ్యక్తిగత డేటా రక్షణకు, ప్రజా ప్రయోజనాలకు మధ్య సమతూకం పాటిస్తూ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను బిల్లులో చేర్చకపోవడం సరికాదని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ప్రభావానికి లోనుకాకుండా పార్లమెంటరీ బోర్డు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొంది.

Also Read: అరుదైన రికార్డు సాధించిన తిలక్‌ వర్మ..

#lok-sabha #rajya-sabha #the-dpdp-bill #personal-data-protection-bill-2023 #the-digital-personal-data-protection-bill #lok-sabha-passes-digital-personal-data-protection-bill #digital-personal-data-protection-bill
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe