Parliament Sessions : నాలుగోరోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము (Murmu) ప్రసింగిస్తున్నారు. కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. గెలిచిన వారంతా దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతారని ఆశిస్తున్నానన్నారు. తమ ప్రభుత్వం భారత్ (India) ను ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశంగా మార్చేందుకు కట్టుబడి ఉందన్నారు.
Also Read: ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిన నాగ్ అశ్విన్.. ‘కల్కి’లో ఈ ఐదుగురి గెస్ట్ రోల్స్ అస్సలు ఊహించలేదే!
గతంలో కంటే రెట్టింపు కి.మీ జాతీయ రహదారులను నిర్మించామన్నారు. మూడుకోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలు (Agriculture Jobs) పెరుగుతున్నాయని.. పౌర విమాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. దేశంలో సంస్కరణలు మరింత వేగం పుంజుకుంటాయని.. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు.