సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ ను చంపేస్తామంటు బెదిరింపు కాల్స్...నిందితుడి అరెస్టు....!

సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకరు బెదిరింపు కాల్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఎంపీకి నిందితుడు మొబైల్ నుంచి ఫోన్ కాల్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అతని నంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి అతన్ని అరెస్టు చేశామన్నారు.

author-image
By G Ramu
సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ ను చంపేస్తామంటు బెదిరింపు కాల్స్...నిందితుడి అరెస్టు....!
New Update

సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆమెను హతమారుస్తామంటూ దుండగుడు ఒకరు బెదిరింపు కాల్ చేశాడు. ఈ మేరకు ఎంపీ నవనీత్ కౌర్ ప్రైవేట్ సెక్రటరీ వినోద్ గుహ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవనీత్ కౌర్ కు గత వారం రోజులుగా నిందితుడు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు ఫిర్యాదులో వినోద్ గుహ వెల్లడించారు. ఎంపీని అసభ్య పదజాలంతో దుండగుడు దూషించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. దుండగున్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితున్ని విట్టల్ రా గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నిందితునిపై ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. నిందితుడు మొబైల్ ఫోన్ ఉపయోగించి ఎంపీ నవనీత్ కౌర్ కు ఫోన్ కాల్స్ చేసినట్టు తెలిపారు. నంబర్ ట్రేస్ చేసి అతని లొకేషన్ ను గుర్తించామన్నారు.

అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజక వర్గం నుంచి నవనీత్ కౌర్ ఎంపీగా వున్నారు. ఆమె భర్త రవి రాణా బందేరా నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతేడాది అప్పటి సీఎం ఉద్దవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా చదివేందుకు నవనీత్ కౌర్ దంపతులు ప్రయత్నించారు.

దీంతో శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన నేపథ్యంలో కౌర్ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై దేశ ద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. అనంతరం దేశ ద్రోహ చట్టంలోని వివాదాస్పద సెక్షన్లపై కోర్టు స్టే విధించింది. దీంతో వారిపై ఉన్న కేసును న్యాయస్థానం నిలిపి వేసింది.

#police #arrested #navaneet-kaur #threat-call #ravi-rana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe