Sitaram Naik : లోక్ సభ ఎన్నికల(Lok Sabha Election) వేళ నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) మెల్లిమెల్లిగా ఖాళీ అవుతోంది. తెలంగాణ(Telangana) లో బీజేపీ(BJP) ఆపరేషన్ ఆకర్ష్(Operation Akarsh) మొదలు పెట్టింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో గెలుపే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ(BJP).. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలను తమ పార్టీలోకి లాగేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇచ్చింది కాషాయం పార్టీ. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్(Sitaram Naik) బీజేపీలో చేర్చుకునేందుకు మంతనాలు చేస్తోంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల కేసీఆర్ తనకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. దీంతో పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని భావించిన సీతారాం కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం.
ALSO READ: శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. 14 మంది చిన్నారులు.!
ఎంపీ టికెట్ ఇస్తాం.. వచ్చేయండి..
టికెట్ రాలేదని భంగపడ్డ మాజీ ఎంపీ సీతారాంకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణలో ఎంపీ అభ్యర్థులు కరువు కావడంతో తమ పార్టీ బలహీనంగా ఉన్న చోట ఇతర పార్టీలో నుంచి నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం గాలం వేస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ సీతారాంకు రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఖమ్మం ఎంపీ టికెట్ ను జలగం వెంకట్రావుకు బీజేపీ పెద్దలు ఆర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను వీరు స్వీకరిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.
9 మందిని ప్రకటించిన బీజేపీ..
తొలి జాబితాలో లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయబోయే తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది.
1. కిషన్ రెడ్డి- సికింద్రాబాద్
2. బండి సంజయ్ – కరీంనగర్
3. ధర్మపురి అర్వింద్ – నిజామాబాద్
4. బీబీ పాటిల్ – జహీరాబాద్
5. పోతుగంటి భరత్ – నాగర్ కర్నూల్
6. బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి
7. కొండ విశ్వేశ్వర రెడ్డి – చేవెళ్ల
8. మాధవీలత – హైదరాబాద్
9. ఈటల రాజేందర్ – మల్కాజ్‌గిరి