BJP Second List: బీజేపీ రెండో జాబితా విడుదల

ఇటీవల దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురిని ప్రకటించింది.

New Update
BJP Second List: బీజేపీ రెండో జాబితా విడుదల

BJP Second List: ఇటీవల దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం తాజాగా రెండో జాబితాను ప్రకటించింది. 72 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఆరుగురిని ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలను హోల్డ్ లో పెట్టింది. అయితే.. ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పడంతో వరంగల్ ఎంపీ స్థానాన్ని హోల్డ్ లో పెట్టింది.  ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నలుగురిలో ముగ్గురికి ఎంపీ టికెట్ కేటాయించింది.

ALSO READ: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసేది అక్కడి నుంచే?

రెండో లిస్టులో వీరికి ఛాన్స్.. 

  • మెదక్ - రఘునందన్ రావు
  • ఆదిలాబాద్ - నగేష్
  • మహబూబాబాద్ - సీతారాం నాయక్
  • నల్గొండ - సైది రెడ్డి
  • మహబూబ్ నగర్ - డీకే అరుణ
  • పెద్దపల్లి - గోమస శ్రీనివాస్

తొలి జాబితాలో తొమ్మిది మంది..

1. కిషన్ రెడ్డి- సికింద్రాబాద్
2. బండి సంజయ్ – కరీంనగర్
3. ధర్మపురి అర్వింద్ – నిజామాబాద్
4. బీబీ పాటిల్ – జహీరాబాద్
5. పోతుగంటి భరత్ – నాగర్ కర్నూల్
6. బూర నర్సయ్య గౌడ్ – భువనగిరి
7. కొండ విశ్వేశ్వర రెడ్డి – చేవెళ్ల
8. మాధవీలత – హైదరాబాద్
9. ఈటల రాజేందర్ – మల్కాజ్‌గిరి

మోడీ, అమిత్ షా ఎక్కడి నుంచంటే..

మొత్తం 16 రాష్ట్రాల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి 51 మంది, బెంగాల్ నుంచి 20 మంది, మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, కేరళ నుంచి 12 మంది, తెలంగాణ నుంచి 9 మంది, అస్సాం నుంచి 11 మంది, ఝార్ఖండ్ నుంచి 11 మంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 11 మంది, ఢిల్లీ నుంచి 5 మంది, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇద్దరు, గోవా నుంచి ఒకరు, త్రిపుర నుంచి ఒకరు, అండమాన్ నుంచి ఒకరు పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక మరోసారి వారణాసి (Varanasi) నుంచి ఎంపీగా ప్రధాని మోడీ (PM Modi) పోటీ చేయనున్నారు. అలాగే అమిత్ షా (Amit Shah) గాంధీ నగర్ నుంచి పోటీ చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు