Sri Ganesh Joined Congress: లోక్ సభ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరికలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా తెలంగాణలో బీజేపీకి (BJP) ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి కంటోన్మెంట్ నేత శ్రీ గణేష్ రాజీనామా చేశారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మల్కాజ్ గిరి (Malkajgiri) ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెంది రెండో స్థానం లో సరిపెట్టుకున్నారు శ్రీ గణేష్.
ఎమ్మెల్యేగా ఓటమి..
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు శ్రీ గణేష్. అయితే.. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత (Lasya Nanditha) చేతిలో ఓటమి చెందారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత. తన తండ్రి మరణం వల్ల బీఆర్ఎస్ లాస్యకు టికెట్ కేటాయించింది. ఈ క్రమంలో ఆమె కంటోన్మెంట్ లో గులాబీ జెండా ఎగరవేసింది. శ్రీ గణేష్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన గద్దర్ కూతురు వెన్నెల మూడో స్థానంలో నిలిచారు. అయితే.. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో అక్కడ మూడో స్థానానికి అంకితం అయింది. తాజాగా లాస్య నందిత మృతి చెందడంతో ఉప ఎన్నికకు నోటిఫిషన్ వచింది. మే 13న కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక జరగనుంది. అయితే మరోసారి శ్రీ గణేష్ ను బరిలోకి దించాలన్న బీజేపీకి ఆయన రాజీనామా చేయడంతో ఎదురుదెబ్బ తగిలింది.
ఎంపీ టికెట్?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన శ్రీ గణేష్ లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీ గా పోటీ చేయాలని భావించారు. అయితే బీజేపీ అధిష్టానం తనకు కాకుండా ఈటల రాజేందర్ కు కేటాయించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీకి రాజీనామా చేశారు. అయితే మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ లో చేరినట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. ఇప్పటి వరకు మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించకపోవడంతో జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది.