Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు.. రఘునందన్ రావుకు బీజేపీ షాక్?

రఘునందన్ రావుకు బీజేపీ షాక్ ఇచ్చింది. తొలి జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదు. మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న ఆయనకు కాకుండా అంజిరెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

New Update
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు.. రఘునందన్ రావుకు బీజేపీ షాక్?

Raghunandan Rao: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 16 స్థానాల్లో గెలుపే టార్గెట్ గా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ హైకమాండ్. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది. నిన్న (శనివారం) 195 మందితో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను బీజేపీ (BJP First List) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఎన్నికల బరిలో దిగే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.

రఘునందన్ రావుకు టికెట్ కట్?

బీజేపీ అధిష్టానం ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు వస్తుందని ఎన్నో ఆశలతో ఉన్న రఘునందన్ రావుకు (Raghunandan Rao) షాక్ తగిలింది. తొలి జాబితాలో ఆయన పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించలేదు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక (Dubbaka) నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ రావు.. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు.

ALSO READ: బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే

మెదక్ ఎంపీ టికెట్ ఆయనకేనా?

బీజేపీలో మెదక్ ఎంపీ సీటు కాక రేపుతోంది. మెదక్ ఎంపీ సీట్ ను (Medak MP Ticket) ఇంకా పెండింగ్‌లోనే ఉంచింది బీజేపీ హైకమాండ్. అయితే.. కొత్త ముఖాలకే ఎంపీ టికెట్ ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. మెదక్ ఎంపీ టికెట్ కోసం గోదావరి అంజిరెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మూడు సార్లు హామీ ఇచ్చినా టికెట్ దక్కలేదనీ ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని అంజి రెడ్డి డిమాండ్ చేస్తున్నారట. రఘునందన్‌కు కాకుండా వేరొకరికి టికెట్ ఇస్తారని పార్టీ లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో మెదక్ పార్లమెంట్‌ పరిధిలో రఘునందన్ పర్యటనలు చేస్తుండగా.. వేరొకరికి టికెట్ ఇస్తారన్న ప్రచారంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెదక్ సీటును పెండింగ్ లో పెట్టి బీజేపీ సస్పెన్స్ క్రేయేట్ చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు