/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Shock-to-modi.jpg)
Shock To Modi : కేజ్రీవాల్(Kejriwal)కు బెయిల్ రావడంతో పార్లమెంట్ ఎన్నికల(Parliament Elections) వేళ మోదీ సర్కార్(Modi Sarkar)కు బిగ్ షాక్ తగిలినట్లైంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియా కూటమికి మాత్రం ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో ఇండి కూటమిలో జోష్ కనిపిస్తోంది. కేజ్రీవాల్‌కు బెయిల్ తమకు కలిసివస్తుందంటున్న ఇండి కూటమి నేతలు భావిస్తున్నారు. దేశంలో మరో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై కేజ్రీవాల్ బెయిల్ అంశం ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. మే-25న ఆరో దశలో ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ పోలింగ్‌పై కేజ్రీవాల్ బెయిల్ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని ఆప్ భావిస్తోంది. నిజం గెలిచిందంటూ ఆప్(AAP) సంబరాలు చేసుకుంటోంది.