లోక్ సభ రేపటికి వాయిదా....అప్పటి వరకు సభలోకి రానన్న స్పీకర్..!

లోక్ సభ రేపటికి వాయిదా....అప్పటి వరకు సభలోకి రానన్న స్పీకర్..!
New Update

Lok Sabha Adjourned : పార్లమెంట్‌లో మణిపూర్(Manipur) అంశంపై రచ్చ జరుగుతోంది. తాజాగా బుధవారం కూడా మణిపూర్ అంశంపై లోక్ సభలో (Lok Sabha) రభస జరిగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్ లోకి దూసుకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దీంతో సభను మొదట మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

సభలో సభ్యుల తీరుపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో అధికార, ప్రతిపక్షాల తీరు సంతృప్తికరంగా లేదని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. . సభను తాను నడపలేనని ఆయన అన్నట్టు తెలుస్తోంది. సభ్యులంతా సభా ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా వ్యవహరించే వరకు తాను సభకు రాబోనని అధికార, విపక్ష సభ్యులతో ఆయన వెల్లడించినట్టు సమాచారం.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సభ పున: ప్రారంభం కాగా మళ్లీ అదే పరిస్థితి కొనసాగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు. అంతకు ముందు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కేబినెట్ మంత్రులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మరో వైపు రాజ్యసభలో(Parliament) అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్షాల సభ్యులతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బేటీ అయ్యారు.

ఇక రాజ్యసభలోనూ బుధవారం అదే పరిస్థితి కొనసాగింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేశారు. ఇధి ఇలా వుంటే మోడీ సర్కార్(Modi Government) విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు 17 గంటల సమయాన్ని కేటాయించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు తీర్మానంపై ప్రధాని మోడీ సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.

#lok-sabha #manipur #lok-sabha-adjourned #parliament-live
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe