LK Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఈరోజు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో (Apollo Hospital) చేరారు. న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీ అడ్మిట్ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన జులైలో కూడా అనారోగ్యంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కూడా చికిత్స తీసుకున్నారు. వయసు మీద పడడంతో అద్వానీ అనారోగ్యం బారిన పడ్డారని.. దీనికి ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అద్వానీ 2002 నుండి 2004 వరకు భారతదేశానికి 7వ ఉప ప్రధానమంత్రిగా పని చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) సహ వ్యవస్థాపకులలో ఒకరు.. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యుడిగా ఉన్నారు. 1998 నుండి 2004 వరకు హోంమంత్రిగా పనిచేశారు. లోక్‌సభలో ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు .
Also Read: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రధాని ఎవరంటే?