/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tiger-2-jpg.webp)
పులి అంటే క్రూర జంతువు. మాటువేసి వేటాడటం దాని నైజం. పంజా విసిరే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోదు. వేటాడేందుకు నిత్యం ఉవ్విళ్లూరుతుంటుంది. ఇంతటి ప్రమాదకరమైన పులులను జనాలు పెంచుకోవడం అప్పుడప్పుడూ వార్తల్లో చూసే ఉంటాం. ,కానీ పిల్లలు ఎవరూ ఇప్పటి వరకూ వీటి జోలికి వెళ్లలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఓ కుర్రాడు సరిగ్గా ఇదే చేశాడు. పులికి ఏ మాత్రం భయపడకుండా దానిని కుక్కపిల్లలా తాడు కట్టి ఇంట్లో తిప్పుతున్నాడు.
Also Read: పాక్ క్రికెట్‌ను వెంటాడుతోన్న శని.. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు మరో షాక్..!
View this post on Instagram
అతడు ఓ పులి మెడకు చైను కట్టి ఇల్లాంతా తిప్పడం ప్రారంభించాడు. వాస్తవానికి ఆ పులి టీనేజ్‌లో ఉన్నప్పటికీ పిల్లాడికంటే పెద్దదిగానే కనిపిస్తోంది. ఒక్క పంజా విసిరితే ఆ బాలుడు బ్రతికే ఛాన్సే లేదు. అలాంటిది.. పులి లాంటి అతి క్రూర జంతువును వీడియోలోని చిన్నారి ఓ కుక్క పిల్లలా మెడకు చైన్ కట్టి నాలుగు గోడల మధ్య తిప్పుతుండటం జనాలను ఆశ్చర్యపరుస్తోంది. పులి దాడికి దిగితే పారిపోయే అవకాశం కూడా లేనట్టు ఉన్న గదిని చూసి జనాలు భయపడిపోతున్నారు.
ఈ పిల్లాడు ఎవరు? వీడియో ఎక్కడ తీశారు? పెద్ద వాళ్ల పర్యవేక్షణ ఉందా లేదా? పులి తిరగబడితే రిస్క్ అని తెలిసీ ఇలాంటి వీడియో ఎందుకు క్రియేట్ చేశారు? వైరల్ కంటెంట్ కోసం పిల్లల జీవితాలతో ఆడుకుంటారా? అంటూ నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధిస్తూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీడియోను చూసిన వారందరూ భయభ్రాంతులకు లోనవుతున్నారు.