/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
CM Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన అరెస్ట్, ఈడీ కస్టడీని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. ఈ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. మొదటగా కేజ్రీవాల్ కు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది.. ఆ తరువాత మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీని పొడిగించింది. ఈ నెల 1వ తేదీన ఈడీ.. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని తద్వారా మద్యం కుంభకోణం కేసులో అనేక విషయాలు బయటకు వస్తాయని కోర్టుకు విన్నపించుకోగా.. ఏప్రిల్ 15వ తేదీ వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగించింది. ఈ కేసులో తనకు ఊరట లభిస్తుందని అనుకున్న కేజ్రీవాల్ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.
ALSO READ: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు బెయిల్
Delhi High Court reserves order on Chief Minister Arvind Kejriwal's plea challenging his arrest by ED and remand in alleged liquor policy case. #ArvindKejriwal #ED pic.twitter.com/NqOy80Gwh5
— Live Law (@LiveLawIndia) April 3, 2024
ఎమ్మెల్సీ కవితకు బెయిల్?
లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఎమ్మెల్సీ కవిత అలియాస్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుకు ఇప్పట్లో బెయిల్ వచ్చేలా కనిపించడం లేదు. సీఎం కేజ్రీవాల్ బెయిల్ పై కవిత బెయిల్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు నిపుణులు. ఒకవేళ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే కవిత కు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కానీ, కేజ్రీవాల్ కు మాత్రం ఈ కేసులో కోర్టు ఊరట ఇవ్వట్లేదు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను వాయిదా రూపంలో ముందుకు తోస్తూ వస్తోంది. ఈరోజు మరోసారి కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ దేశ రాజకీయాల్లో నెలకొంది. మరి కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందా? లేదా? అనేది మరికొన్ని గంటల్లోతెలియనుంది.