2023 ఫిఫా (FIFA) బెస్ట్ ప్లేయర్ అవార్డ్‌కు మెస్సీకి గట్టి పోటీనే ఎదురయ్యింది. నార్వఏ ఫార్వార్డ్ ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరూ 48 పాయింట్లతో సముజ్జీలుగా నిలిచారు. అయితే కెప్టెన్నల ప్యానెల్ నుంచి మెస్సీకి ఎక్కువ ఓట్లు రావడంతో చివరికి విజేతగా అతనినే ప్రకటించారు. రికార్డ్ స్థాయిలో మెస్సా ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డును మూడోసారి గెలుచుకున్నాడు. 2019, 2022, 2023 సంవత్సరాల్లో అతనికి ఈ అవార్డ్ వచ్చింది.
బాలన్ డి ఓర్ అవార్డు కూడా...
మెస్పీ ఆట ముందు ఇదొక్క అవార్డే కాదు ఇంకా చాలా అవార్డులు తలవొగ్గాయి. 2023 బాలన్ డి ఓర్ అవార్డ్ (Ballon d'Or Award) ను కూడా మెస్సీనే సొంతం చేసుకున్నాడు. ఇందులో కూడా అతనికి రికార్డ్ ఉంది. బాలన్ డి ఓర్ అవార్డును మెస్సీ ఎనిమిది సార్లు కైవసం చేసుకున్నాడు. మరోవైపు మెస్సీకి అవార్డు ప్రకటించగానే మరో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అతనిని కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు. అయితే ఈసారి రొనాల్డో అసలు ఈ ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్ రేస్‌లోనే లేడు. ఇక మెస్సీ అవార్డు అయితే గెలుచుకున్నాడు కానీ దానిని అందుకోవడానికి మాత్రం అందుబాటులో లేడు. లీగ్‌లతో బిజీగా ఉండడం వలన అవార్డుల ఫంక్షన్‌కు రాలేకపోయాడు. అయితేనేం మెస్సీ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. తమ ఫేవరెట్ ప్లేయర్ మరిన్ని అవార్డులు గెలుచుకుంటాడని చెబుతున్నారు.