PM Modi : ప్రధాని మోదీలాగా...లక్షద్వీప్ లో సంతోషంగా గడపాలంటే...ఈ బడ్జెట్ చాలు...!!

ప్రధాని మోడీ లక్షద్వీప్ టూర్ ఫొటోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మీరు కూడా లక్షద్వీప్ అందాలను ఆస్వాదించాలంటే.. కొచ్చి నుంచి ఓడలో రూ. 2200-రూ. 5,000, ఫ్లైట్ అయితే రూ. 5500 నుంచి ఛార్జీ ఉంటుంది. రూ. 25000-రూ. 50,000 బడ్జెట్ తో లక్ష ద్వీప్ వెళ్లి రావొచ్చు.

PM Modi : ప్రధాని మోదీలాగా...లక్షద్వీప్ లో సంతోషంగా గడపాలంటే...ఈ బడ్జెట్ చాలు...!!
New Update

PM Modi: ఈ ఏడాది ప్రారంభంలో మోదీ (PM Modi) రెండు రోజుల పర్యటన నిమ్మిత్తం లక్షద్వీప్ (Lakshadweep)లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 3,4 తేదీల్లో ప్రధాని మోదీ లక్షద్వీప్ లోపర్యటించారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు కూడా ప్రధాని మోదీ వలె లక్షద్వీప్ లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా?లక్షద్వీప్ వెళ్లాలంటే బడ్జెట్(Budget) ఎంత కావాలి? అలల శబ్దాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతి అందాల(Beauty of nature)ను ఆస్వాదించాలనుకుంటే...ఎంత ఖర్చు అవుతుంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం.

లక్షద్వీప్ అరేబియా సముద్రం మధ్యలో ఉన్న స్వర్గం. ఇక్కడికి ప్రతిఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే లక్షద్వీప్ ను సందర్శించాలంటే ఉత్తమమైన సమయం ఏది. అక్కడికి ఎలా చేరుకోవాలి. అక్కడేం చూడాలి?ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చూద్దాం.

అక్టోబర్ నుంచి మార్చి ఉత్తమమైన సమయం:
లక్షద్వీప్ లో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అయితే అక్టోబర్ నుంచి మార్చి మధ్య మంచి సమయంగా చెబుతుంటారు. ఈకాలంలో వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు ప్రయాణానికి సౌకర్యంగానూ ఉంటుంది. మే మధ్య వేసవిలోకూడా లక్షద్వీప్ ను సందర్శించేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సమయంలో అక్కడున్న అన్ని ప్రదేశాలను చూడవచ్చు.

ఇలా చేరుకోవచ్చు:
అరేబియా సముద్ర తీరంలో ఉన్న లక్షద్వీప్ కు కేవలం నీటినౌక లేదా ఫ్లైట్ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. కొచ్చి నుంచి ఓడ ద్వారా 14 నుంచి 20గంటల సమయం పడుతుంది. మీరు తొందరగా చేరుకోవాలనుకుంటే కొచ్చి నుంచి నేరుగా అగట్టి ఎయిర్ పోర్టు చేరుకోవచ్చు. అగట్టి లక్షద్వీప్ లో ఏకైక ఎయిర్ పోర్టు. మినీకాయ్, కల్పేని ద్వీపాలతోపాటు ఇతర దీవులకు పడవల్లో వెళ్లవచ్చు. ఇక్కడికి హైలికాప్టర్ రైడ్ కూడా ఉంటుంది.

అక్కడేం చూడాలి:
లక్షద్వీప్ లో అందమైన బీచ్ లు, నీటి అడుగున ఉండే జీవులను చూడటం లాంటి అనేక కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, అండర్ సీ వాకింగ్ వంటి సాహసాలు కూడా చేయవచ్చు. అంతేకాదు పర్యాటకులు ఇక్కడ కుయాకింగ్, కానోయింగ్ , జెట్ స్కీయింగ్, కైట్ సర్ఫింగ్, పారాఫైలింగ్ లను కూడా ఆస్వాదించవచ్చు. మీరు పడవ ద్వారా అనేక దీపాలను చూడవచ్చు. బంగారు దీవుల్లో డాల్ఫిన్ లను చూడాటానికి మంచి ప్రదేశాలు.

ఆహారం:
లక్షద్వీప్ లోని ఆహారంలో ఖచ్చితంగా కేరళ ప్రస్తావనకు వస్తుంది. మలబార్ వంటకాలు ఇక్కడ చాలా ఇళ్లలో కనిపిస్తాయి. కొబ్బరి నూనె, కరివేపాకు ప్రతీ వంటకంలోనూ మ్యాజిక్ చేస్తాయి. చేపలు ప్రధాన వంటకం. కోడిగుడ్లు, అన్నంతో కూడిన వంటకాన్ని కిలాంజి అని పిలుస్తారు.మినీకాయ్ ద్వీపంలోని ప్రసిద్ధ మూస్ కబాబ్ ట్యూనా చేపల నుంచి తయారు చేస్తారు. ఆక్టోపస్ ఫ్రై లక్షద్వీప్ లో మాత్రమే లభించే ప్రత్యేకమైన వంటకం.

బడ్జెట్:
నాలుగు పగలు, మూడు రాత్రుళ్ల కోసం లక్షద్వీప్ టూర్ ప్యాకేజీలు దాదాపు రూ. 23, 049 నుంచి ప్రారంభం అవుతాయి. అయితే ఈ ప్యాకేజీ లక్షద్వీప్ కు చేరుకున్న తర్వాత ప్రారంభం అవుతుంది. మీరు లక్షద్వీప్ చేరుకోవడానికి తిరిగి రావడానికి మీ సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు తక్కువ బడ్జెట్ లో లక్షద్వీప్ ను చూడాలనుకుంటే ఓడలో వెళ్లడం బెస్ట్ ఆప్షన్. కొచ్చి నుంచి లక్షద్వీప్ వరకు 14 నుంచి 20గంటల సమయం పడుతుంది. రూ. 22వేల నుంచి 50వేల వరకు ఖర్చు అవుతుంది.

ఇది కూడా చదవండి:   నిరుద్యోగులకు మంత్రి తుమ్మల శుభవార్త.. ఖమ్మంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్..!!

#pm-modi #lakshadweep-tour
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe